తాంసి(తలమడుగు), డిసెంబర్ 17: బోథ్ నియోజ కవర్గంలోని గ్రామాలాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తలమడుగు మండలంలోని ఝరి గ్రామంలో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని అన్నారు.
ఝరి గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సబ్ స్టేషన్ ఏర్పాటుతోపాటు శివాలయానికి ప్రహరీ, సవారీ బంగ్లా షెడ్ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల్లో మొ దటగా రూ.500కే గ్యాస్ సిలిండర్, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను ఝరి గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు, ఎ మ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ ఎంపీ గొడం నగేశ్, బీఆర్ఎస్ నా యకులు సంజీవ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, మేకల రవికాంత్, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, నగేష్, పొచ్చన్న, గడుగు గంగన్న పాల్గొన్నారు.
తాంసి(తలమడుగు), డిసెంబర్ 17: కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు హామీలు పూర్తి చేశామని అబద్ధాలు ఆ డుతున్నారని ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షు డు మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం ఝరి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ఏదైతే ఆరు గ్యారంటీలని ప్రజలకు హామీ ఇచ్చిందో తూచా తప్పకుండా నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 9న రైతులకు రూ.2 లక్షల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారని, ఏమైందని ప్రశ్నించారు. ఒక్క గ్యారంటీ కూడా సక్రమంగా అ మలు చేయక ముందే రెండు గ్యారెంటీలు పూర్తి చేశామని ప్రజలకు అబద్ధం చెప్పడం కాంగ్రెస్ పార్టీ నాయకులకే సాధ్యమని అన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు.
ఇచ్చోడ, డిసెంబర్ 17: మండల కేంద్రంలోని విఠలేశ్వర ఆలయాన్ని ఆదివారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశా రు. ఈ సందర్భంగా అనిల్ జాదవ్‌ను శాలువాతో సన్మానించి, శుభా కాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షులు ఏను గుల కృష్ణారెడ్డి, ఎంపీపీ నిమ్మల ప్రీతం రెడ్డి, బీఆర్ఎస్ నా యకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.