ఉట్నూర్/ఉట్నూర్ రూరల్/ఖానాపూర్ రూరల్, జూలై 25 ;వ్యవసాయానికి మూడు గంటలే కరెంటు చాలన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లెల్లోకి వస్తే తరిమికొట్టాలని బీఆర్ఎస్ శ్రేణులు, రైతులకు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పిలుపునిచ్చారు. ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపు మేరకు మంగళవారం ఉట్నూర్, ఉట్నూర్ రూరల్, ఖానాపూర్ రైతు సభల్లో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొమ్మిది గంటల కరెంటు మాత్రమే ఇచ్చారని, అది కూడా పగలు నాలుగు, రాత్రి ఐదు గంటల విద్యుత్ మాత్రమే ఇచ్చేవారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ 24 గంటల విద్యుత్ ఇస్తుండడంతో అది గిట్టని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం విడ్డూరమన్నారు. – ఉట్నూర్, జూలై 25 : వ్యవసాయానికి మూడు గంటలే కరెంటు చాలన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లెల్లోకి వస్తే తరిమికొట్టాలని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ బీఆర్ఎస్ శ్రేణులు, రైతులకు పిలుపునిచ్చారు. ఐటీ, మున్సిపల్ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు పిలుపు మేరకు మంగళవారం ఉట్నూర్ రైతు వేదికలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే రేఖానాయక్ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. మూడు గంటలు కావాలో.. మూడు పంట లు కావాలో రైతులే తేల్చుకోవాలని సూచించారు. గత ప్రభుత్వాలకు, ప్రస్తుత తెలంగాణ సర్కారు ఉన్న తేడా చూసుకోవాలన్నారు. గతంలో వ్యవసాయానికి కరెంట్ ఎప్పుడు వస్తుందో.., ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితిలో రైతులు అష్టకష్టాలు పడ్డారని గుర్తుచేశారు. ఎరువుల కోసం క్యూ లైన్లో నిలుచునేవారని పేర్కొన్నారు. కానీ, ఇప్పు డు ఆ పరిస్థితి లేదని, నిరంతర కరెంట్, అవసరానికి ఎరువులు సకాలంలో అందుబాటులో ఉం టున్నాయని గుర్తుచేశారు. ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ బాలాజీ, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కందుకూరి రమేశ్, మాజీ జడ్పీటీసీ వాగ్మారే జగ్జీవన్‌రావు, కోఆప్షన్ రసీద్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అహ్మద్ అజీం, నాయకులు సెడ్మకి సీతా రాం, సింగారే భరత్ పాల్గొన్నారు.
ఉమ్రి రైతు వేదికలో..
ఉట్నూర్ రూరల్, జూలై 25 : మండలంలోని ఉమ్రి రైతు వేదికలో నిర్వహించి రైతు సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం రైతులకకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నారన్నారు. అలాగే రైతులను అన్ని విధాలా ఆదుకుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతుల కష్టాలను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దావులే బాలాజీ, మండల కో-ఆప్షన్ సభ్యుడు రషీద్, ఉమ్రి సర్పంచ్ విఠల్, నర్సాపూర్ సర్పంచ్ కళావతి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అజీముద్దీన్, బాజీరావు, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కందుకూరి రమేశ్, మాజీ అధ్యక్షుడు సంగారే భారత్, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
బాదనకుర్తి రైతు వేదికలో..
ఖానాపూర్ రూరల్, జూలై 25 : మండలంలోని బాదనకుర్తి రైతు వేదికలో ఎమ్మెల్యే రేఖా నాయక్ రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లే ని విధంగా రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన కరెంటు ఇస్తున్నది తెలంగాణ సర్కారేనని అ న్నారు. నాడు కాంగ్రెస్ నాయకులు రాక్షసంగా పాలించి 3 గంటల కరెంట్ ఇచ్చారని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రైతులకు ఆ కష్టాల నుంచి విముక్తి లభించిందన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రంగానికి సరఫరా చేస్తున్న కరెంటుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నదని మండిపడ్డారు. రైతులపై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై రైతు వేదికలో చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన ఘనతను తెలియజేశారు. నాటి రైతుల పరిస్థితి, ఇప్పటి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలన్నారు. అనంతరం రైతు వేదిక ప్రాంగణంలో మొక్కలను నాటారు. ఏఎంసీ మాజీ చైర్మన్ పుప్పాల శంకర్, వైస్ ఎంపీపీ వాల్సింగ్, ఏఎంసీ వైస్ చైర్మన్ గొర్రె గంగాధర్, పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, అమంద శ్రీనివాస్, సర్పంచ్‌లు పార్శపు శ్రీనివాస్, అడిదెల మహేందర్, ఉప సర్పంచ్ నవీన్, నాయకులు ఆకుల వెంకాగౌడ్, రాజగంగన్న, తూము చరణ్, పుప్పాల గజేందర్, పత్రి నగేశ్, కరిపె శ్రీనివాస్, దాసరి గొండ మల్లయ్య, అంజన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.