కాసిపేట : కాసిపేట ( Kasipeta) మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీకి ( Orient Cement Company) చెందిన పలువురు కార్మికులు, పలువురు మైనార్టీ నాయకులు పోలవేణి పోషన్న ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో (Joinings) చేరారు. ఈ మేరకు ఆదివారం మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్, కాసిపేట మండల అధ్యక్షులు సూరం సంపత్ కుమార్ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి దేవునూరి సంతోష్ కుమార్, మండల ఉపాధ్యక్షులు బాకి కిరణ్, నాయకులు కసాడి రమేష్, రామిళ్ళ మహేష్, పోలవేణి పర్వతాలు, కోడూరి రమేష్, చిలుక మల్లేష్, సోల శ్రీనివాస్, కాలవేని రమేష్, జంగిలి రాజ్ కుమార్, జాడి లింగయ్య, సందవేణి సంజీవ్, పవన్, అంజి, రవీందర్, శ్రీనివాస్, రాకేష్, మహేష్, శివ, నవీన్, అభి, మైనార్టీ నాయకులు అనీఫ్, హరీఫ్, గౌస్, జమీర్, సోహెల్ తదితరులు పాల్గొన్నారు.