ఇంద్రవెల్లి, ఏప్రిల్ 20 ః ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ గ్రామ సమీపంలో గల అమరవీరుల స్తూపం వద్ద అమరవీరుల ఆశయ సా ధన కమిటీ, ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో స్వేచ్ఛగా నివాళులర్పించారు. ఏప్రిల్ 20, 1981లో పోలీసు కాల్పుల్లో అమరులైన వీరులకు ఆదివాసీ గిరిజనులు తమ సంస్కృతీ సం ప్రదాయబద్ధంగా శనివారం ప్రత్యేక పూజలు చేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఉమ్మడి జిల్లాలో ని ఆయా మండలాలతోపాటు వివిధ ప్రాంతా ల నుంచి ఆదివాసీ గిరిజనులు ఉదయం 10 గంటలకు స్తూపం వద్దకు చేరుకున్నారు. గోం డ్గూడ నుంచి ప్రారంభమైన ర్యాలీ మండల కేంద్రంలో గుండా అమరవీరుల స్తూపం వద్ద కు చేరుకుంది. ముందుగా అమరవీరుల పేరి ట జెండాను ఆవిష్కరించారు. అనంతరం సం ప్రదాయ పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. అమరవీరుల స్తూపంతోపాటు జెండా ల వద్ద సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజ లు నిర్వహించి, అమరవీరుల కుటుంబ సభ్యులతోపాటు ఆదివాసులు నివాళులర్పించారు.
ఆదివాసీ గిరిజన హక్కుల కోసం పోరాటాలు చేసి మృతి చెందిన తొడసం ఖట్టికి తుమ్మగూడ గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో నివాళులర్పించారు. మండలంలోని తుమ్మగూడ గ్రామస్తుల ఆధ్వర్యంలో సమక ఎక్స్‌రోడ్డు వద్ద ఖట్టి స్మారకార్థం ఏర్పాటు చేసిన జెండాను ఆవిష్కరించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఆదివాసీ గిరిజనులు మాట్లాడారు. ఆదివాసీ గిరిజనుల కోసం ఆయన ఉద్యమాలు చేశారన్నారు. గిరిజనుల హక్కుల కోసం ఉద్యమాలు చేసిన తొడసం ఖట్టిని అప్పటి పోలీసులు హైద్రాబాద్‌లోని చంచల్‌గూడ జైల్లో ఆరేండ్లు నిర్భందించారన్నారు. యేటా ఏప్రిల్ 20వ తేదీన సంస్మరణ దినంగా నిర్వహిస్తున్నామన్నారు.
శిశు సంక్షేమ శాఖ, ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, మాజీ ఎంపీ సోయం బాపురావ్, బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగణ, బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ భూక్యా జాన్సన్ నాయక్, రాయిసెంటర్ల సార్మేడిలు, ఆదివాసులు అమరవీరులకు నివాళులు అర్పించారు.