సోన్, నవంబర్ 6 : రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని మంజులాపూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు అమలు చేసి ముందుకు తీసుకెళ్తున్నట్లు వివరించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో 450 పడకల వైద్యశాలను త్వరలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు.
ప్రభుత్వ వైద్యశాలల్లో అన్ని రకాల వైద్యం ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ అద్దె పనిముట్లను మండల సమాఖ్య ద్వారా కొనుగోలు చేయగా, మంత్రి అల్లోల ప్రారంభించారు. సోన్ జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అంపోలి కృష్ణప్రసాద్‌రెడ్డి. రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ వెంకట్రామ్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, టీఆర్ఎస్(బీఆర్ఎస్) సోన్ మండల కన్వీనర్ మొహినొద్దీన్, సర్పంచ్ టీ వినోద్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సాద విజయ్‌శేఖర్, నాయకులు ఎల్చల్ గంగారెడ్డి, దాసరి శ్రీనివాస్, దాసరి రాజేశ్వర్, బర్మ దాసు, అల్లోల సురేందర్‌రెడ్డి, తహసీల్దార్ హిమబిందు, ఎంపీడీవో సాయిరాం, అల్లోల మురళీధర్‌రెడ్డి, లెంక వినోద్, రైతులు పాల్గొన్నారు.
పీచరలో..
లక్ష్మణచాంద, నవంబర్ 6 : మండలంలోని పీచరలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలుకు నిరాకరించినా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వడ్లకు మద్దతు ధర చెల్లిస్తున్నదని చెప్పారు. ప్రభుత్వం ఏ- గ్రేడ్ ధాన్యానికి రూ. 2060, బీ గ్రేడ్‌కు రూ. 2040 మద్దతు ధర అందిస్తుందన్నారు. ప్రభుత్వం వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ అందిస్తున్నదని చెప్పారు. రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్నదని వివరించారు. రైతు బీమాతో అండగా ఉంటున్నదన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ వెంకట్ రాంరెడ్డి, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండల కన్వీనర్ కొరిపెల్లి కృష్ణారెడ్డి, సర్పంచ్ బుర్రి లత, ఆర్డీవో తుకారాం, తహసీల్దార్ కవితారెడ్డి, ఎంపీడీవో శేఖర్, పార్టీ జిల్లా కార్యదర్శి అడ్వాల రమేశ్, నాయకులు కేశం రమేశ్, జహీరొద్దీన్, గురాల లింగారెడ్డి, డాబా లస్మన్న, బుర్రి భూమేశ్ పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి
లోకేశ్వరం, నవంబర్ 6 : ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. మండలంలోని నర్సింహనగర్ తండా, పిప్రి, కనకాపూర్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు తాగునీరు, నీడ సౌకర్యం కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ లలిత, భోజన్న, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, వైస్‌ఎంపీపీ మామిడి నారాయణ రెడ్డి, టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండల కన్వీనర్ కరిపే శ్యాంసుందర్, భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ, సర్పంచ్‌లు పార్వతి రాజేశ్ బాబు, వెంకట్ రావు, ముత్తవ్వ, సాయన్న, నరేశ్, ఎంపీటీసీ మగ్గిడి రాణి అనిల్, నాయకులు మెండే శ్రీధర్, ఉత్తంరావు, సీఈవో చిన్నయ్య, రైతులు పాల్గొన్నారు.