నారాయణఖేడ్, ఫిబ్రవరి 16: బీఆర్ఎస్ అధినేత, తొలి సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన లీఫ్ ఆర్టిస్ట్ శివకుమార్ రావి ఆకులపై వేసిన కేసీఆర్ చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. కేసీఆర్ చిత్రంతో పాటు తెలంగాణ పటంలో అంతర్భాగంగా కేసీఆర్ చిత్రాన్ని వేశారు. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.