Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Gajulapeta Villagers | గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి బీటీ రోడ్డు రెన్యువల్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపారని.. కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేయకుండా మూడేళ్లుగా నిర్లక్ష్యం చేస్తుందని గాజులపేట గ్రామస్తులు మండిపడ్డారు.
Gajulapeta Villagers | మహబూబ్ నగర్ జిల్లా, నవంబర్ 8 : మహబూబ్ నగర్ రూరల్ మండలం గాజులపేట గ్రామం నుండి NH 44 వరకు బీటీ రోడ్డు రెన్యువల్, మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్తులు పాదయాత్ర చేపట్టారు.
గ్రామం నుండి హైద్రాబాద్ బెంగళూరు జాతీయ రహదారి వరకు చేపట్టిన ఈ పాదయాత్రలో గ్రామస్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపారని.. కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేయకుండా మూడేళ్లుగా నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు.
గాజులపేట గ్రామస్తులు ఓట్లు వేయలేదనే కక్ష్యతో రోడ్డు పనులను స్థానిక ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి పట్టించుకోవట్లేదని ఆరోపించారు. గుంతల రోడ్డులో వెళ్లాలంటేనే భయంగా ఉందంటున్నారు గాజులపేట వాసులు. ప్రమాదల బారిన పడి గాయపడుతున్నామని, గర్భిణీ స్త్రీలు జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

Read Also :
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్కు టపాసుల ప్రయాణం ఇదే!
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

