కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో లేబర్కోడ్ల అమలా?
బీజేపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నామని ఓవైపు చెబుతూ, మరోవైపు కర్ణాటక, తెలంగాణలో నాలుగు లేబర్కోడ్లను అమలు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ చర్యలు చేపట్టిందని సీపీఎం జాతీయ కార్యదర్శి ఎంఏ బేబీ విమర్శించారు.
- సీపీఎం జాతీయ కార్యదర్శి ఎంఏ బేబీ
హైదరాబాద్, ఫిబ్రవరి 16(నమస్తే తెలంగాణ): బీజేపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నామని ఓవైపు చెబుతూ, మరోవైపు కర్ణాటక, తెలంగాణలో నాలుగు లేబర్కోడ్లను అమలు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ చర్యలు చేపట్టిందని సీపీఎం జాతీయ కార్యదర్శి ఎంఏ బేబీ విమర్శించారు. ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిర్ణయాన్ని వెనకి తీసుకోవాలని డిమాండ్‌చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని సీపీ ఎం రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రజా, కార్మిక , రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో మార్చి 24న ధర్నా నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
అమెరికాతో ఇటీవల మోదీ సరార్ చేసుకున్న వాణిజ్య ఒప్పందం దేశ సమగ్రతకే ప్రమాదకరమని హెచ్చరించారు. దీని ప్రభావం ఒక వ్యవసాయరంగానికే పరిమితం కాదని, అన్ని రంగాలపైనా పడేప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. భారత్ ఏ దేశం నుంచి చమురును దిగుమతి చేసుకోవాలనే విషయాన్ని ట్రంప్ నిర్ణయించడమేంటని ప్రశ్నించారు. కేంద్రం కొత్తగా తెచ్చిన వీబీజీ-రామ్‌జీ పథకంలో కూలీల పనిదినాలు పెంచుతామని చెప్పడం పెద్ద మోసమని మండిపడ్డారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పట్టణ, స్థానిక ఎన్నికల్లో ఎకువ సీట్లలో సొంతంగా పోటీ చేశామని, నిరుడు 12 సీట్లు ఉండగా, ప్రస్తుతం 13 గెలిచామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

