హైదరాబాద్, ఫిబ్రవరి 16(నమస్తే తెలంగాణ) : మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికల ప్రక్రియలో అధికార కాంగ్రెస్ సాగిస్తున్న అరాచకాలు, కుట్రల నేపథ్యం లో బీఆర్ఎస్ అప్రమత్తమైంది. హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలకు సంబంధించిన స్థానిక నాయకత్వం, నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇన్చార్జులతో పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం స్వయంగా మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు. హంగ్ ఏర్పడిన 8 మున్సిపాలిటీల్లో మంగళవారం ఎన్నికలు జరుగనున్నందున పార్టీ సీనియర్ నాయకులను ఆయా మున్సిపాలిటీలకు ఇన్చార్జులుగా నియమించారు.
ఆయాచోట్ల కాంగ్రె స్ చేస్తున్న కిడ్నాప్‌లు, బెదిరింపులు, పోలీసు వ్యవస్థ దు ర్వినియోగం వంటి అంశాలను స్థానిక నేతలను అడిగి తె లుసుకున్న కేటీఆర్, స్థానిక నాయకత్వానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ అరాచకాల నేపథ్యంలో స్థానిక నాయకత్వానికి అన్ని విధాలా అండగా నిలబడేందుకు, ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు పార్టీ తరఫున సీనియర్ నాయకులను ప్రత్యేక ఇన్చార్జులుగా పంపుతున్నట్టు ప్రకటించారు. మంగళవారం ఎన్నికలు జరుగనున్న 8 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ స్పష్టంగా చైర్మన్ పీఠాలను గెలుచుకునే అవకాశం ఉన్నందున, ఈ ఎన్నికలను పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఈ 8 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా ఎగురడం ఖాయమని, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా తమ విజయాన్ని అడ్డుకోలేరని పార్టీ ధీమా వ్యక్తంచేసింది.
మున్సిపాలిటీలకు ఇన్చార్జులు వీరే