సారంగాపూర్, నవంబర్, 20 : 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరుగని అభివృద్ధిని పదేళ్లలో బీఆర్ఎస్ సర్కారు చేసి చూపించా మని మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని సోనాపూర్, ఆర్కా య్ తండా, గోపాల్పేట్ తండా, రాజేశ్వర్తండా, గోపాల్పేట్, సాయి నగర్, మహావీర్తండా, దుర్గానగర్, హన్మాన్ తండా, బోరింగ్‌తండా, నాగపూర్, చర్చితండా, రవీంద్ర నగర్, దేవీ తండా, అడెల్లితండా, దేవీ నగర్, ఐకే నగర్‌తండా, అడెల్లి, కుప్టి తండా, రాం సింగ్ తండా, పోట్యా, బండరేవుతండా, ఆదివా సిగూడ, లక్ష్మీనగర్, దుప్యాతండా, సిరిపెల్లి తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన గిరి జన పల్లెల్లో మౌలిక వసతుల కల్పనకు సర్కారు పెద్దపీట వేసింద న్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే మాటలు నమ్మవద్దని, నిర్మల్ నియోజకవర్గం ఎవరి వల్ల అభివృద్ధి జరిగిందో అలో చించి ఓటు వేయాలన్నారు. కాంగ్రెస్, బీజేపీల పార్టీలను నమ్ముకుంటే నిర్మల్ ప్రాంతం 20 ఏండ్లు వెనక్కివెళ్తుందన్నారు. అనంతరం కౌట్ల (బీ), మహావీర్తండా గ్రామాలకు చెందిన 200 మంది కాంగ్రెస్, బీజేపీకి చెందిన కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వీరికి మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బీఆర్ ఎస్ మండల ఇన్చార్జి అల్లోల మురళీధర్‌రెడ్డి, ఇందులో రైతు బంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ నల్లావెంకట్రాంరెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కుమారి అశ్రుతరెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరావు, అడెల్లి పోచమ్మ ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు, ఎంపీటీసీలు శ్రీనివాస్‌యాదవ్, భోజారెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ దత్తురాం, నాయకులు రాజ్ మహ్మద్, పాతాని భూమేశ్ తదితరులు పాల్గొన్నారు.
మామడ, నవంబర్20 : కొరిటికల్ గ్రామంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కోడలు అల్లోల దివ్యా రెడ్డి, మంత్రి కూమార్తె అల్లోల పల్లవి ఇంటింటా ప్రచారం నిర్వ హించారు. అనంతపేట్ భీమన్న పండుగ సందర్భంగా భీమన్న గజాలను అల్లోల కుటుం బ సభ్యులు దర్శించుకున్నారు. ఎంపీటీసీ అందె సౌజన్య, బీఆర్ ఎస్ మండల కన్వీనర్ చంద్రశేఖర్‌గౌడ్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ కాలగిరి గంగా రెడ్డి, నిర్మల్ మార్కెట్ డైరెక్టర్ నల్ల లింగారెడ్డి, బీఆర్ఎస్వై మండ ల యూత్ అధ్యక్షుడు ఎలూరి రమేశ్‌రెడ్డి, బీఆర్ఎస్ కన్వీనర్ శ్రీనివాస్, రాజసాగర్, రత్నయ్య, లింగం, రవి, రఘు తదితరులు ఉన్నారు.
నిర్మల్ అర్బన్, నవంబర్ 20 : బీఆర్ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ పేర్కొన్నారు. నిర్మల్‌లోని షేక్ సాహెబ్పేట్, వెంకటాద్రిపేట్, గుల్జార్ మార్కెట్, ఇస్లాంపుర కాలనీలో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచా రం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించా రు. ఆయా వార్డుల కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
దిలావర్పూర్ నవంబర్ 20 : దిలావర్పూర్ లో జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు సుభాష్‌రావు ఇంటింటా ప్రచారం నిర్వహిం చారు. బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కొమ్ముల చిన్న దేవేం దర్‌రెడ్డి, మంత్రి అల్లుడు రంజిత్‌రెడ్డి నాయకులు పాల్ద్దె అనిల్, దనే రవి, సప్పల రవి, శ్రీనివాస్‌రెడ్డి, అన్వర్‌ఖాన్ పాల్గొన్నారు.
సోన్, నవంబర్ 20 : సోన్‌లోని బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతి నిధి ముడుసు సత్యనారాయణ బీఆర్ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గ్రామ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటికెళ్లి బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. సర్పంచ్ వినోద్, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణప్రసాద్‌రెడ్డి, మాజీ చైర్మన్ దాసరి శ్రీనివాస్, నాయ కులు ప్రసాద్, పత్తి రాజు, కాంతయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.