సోన్, ఫిబ్రవరి 28 : నిర్మల్ మండలం ఎల్లపెల్లిలో వివిధ ఆలయాలాభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. నిర్మల్ మండలంలోని ఎల్లపెల్లిలో మూడు రోజులుగా శ్రీ ఆంజనేయ శివపంచాయతన నర్సింహస్వామి, నవగ్రహ, ధ్వజ, శిఖర ప్రతిష్ఠాపనోత్సవాలు నిర్వహిస్తున్నారు. మంత్రి అల్లోల దంపతులు మంగళవారం ప్రాణప్రతిష్ఠ విగ్రహాలకు మంత్రి దంపతులు ప్రత్యేకంగా పూజలు చేశారు. బుధవారం నిర్వహించనున్న కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
ఆలయాల అభివృద్ధికి రూ. 85లక్షలు మంజూరు చేసినట్లు వివరించారు. భీమన్న ఆలయానికి రూ. 40లక్షలు, పోచమ్మ ఆలయానికి రూ. 20లక్షలు, పెద్దమ్మ ఆలయానికి రూ. 19లక్షలు, వడ్డెర హనుమాన్ ఆలయానికి రూ. 3లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అల్లోల సోదరులు మురళీధర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, సర్పంచ్ అల్లోల రవీందర్‌రెడ్డి, ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్‌రెడ్డి, ముఠాపూర్ పీఏసీఎస్ చైర్మన్ బోండ్ల గంగాధర్, మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ రాజారెడ్డి, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, బీఆర్ఎస్ నిర్మల్ మండల కన్వీనర్ గోవర్ధన్‌రెడ్డి, నాయకులు కోటగిరి అశోక్, ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 28 : పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సారంగపూర్ మండలానికి చెందిన పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థికసాయం మంజూరు కాగా, క్యాంపు కార్యాలయంలో మంత్రి అల్లోల మంగళవారం చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్రారాం రెడ్డి, వంగ రవీందర్ రెడ్డి, శ్రీనివాస్, చందు, రాజ్‌మహ్మద్ ఉన్నారు.
ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంత
లక్ష్మణచాంద, ఫిబ్రవరి28 : ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంలో శ్రీరాముడి ఆలయం, వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయాల నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాముల వారి ఆలయానికి రూ. 50 లక్షలు, వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూరుచేసినట్లు తెలిపారు. లక్ష్మణచాంద గ్రామంలో ఏడు దేవాలయాల నిర్మాణానికి నిధులు మంజూరుచేసినట్లు తెలిపారు. గ్రామంలోని రోడ్డు వెడల్పు కార్యక్రమానికి స్థానిక నాయకులు చొరవ చూపాలని సూచించారు. ఇండ్లు కోల్పోయిన వారికి తక్షణమే డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. నిర్మల్ జిల్లాకేంద్రంలో మెడికల్ కళాశాల మంజూరు కావడం ద్వారా నిపుణులైన డాక్టర్లు అందుబాటులో ఉంటారన్నారు. జిల్లా కేంద్రంలో 450 పడకల దవాఖాన అందుబాటులోకి రానున్నదని చెప్పా రు.
కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి, ఎంపీపీ అడ్వాల పద్మ, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ కొరిపెల్లి కృష్ణారెడ్డి, సర్పంచ్ సురకంటి ముత్యం రెడ్డి, తహసీల్దార్ కవితారెడ్డి, ఏవో ప్రవీణ్‌కుమార్, మాజీ సర్పంచ్ అట్ల రాంరెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ సాతం గంగారాం, నాయకులు ఈటెల శ్రీనివాస్, జహీరొద్దీన్, సిరాజొద్దీన్, లింగారెడ్డి, కోండ్ర నరేశ్ రెడ్డి, బిట్లింగ్ నారాయణ పాల్గొన్నారు.