సోన్, నవంబర్ 18: రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటేయాలని నిర్మల్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోన్ మండలం జాఫ్రాపూర్, సిద్ధ్దులకుంట, లోకల్ వెల్మల్, గాంధీనగర్, లెఫ్ట్ పోచంపాడ్, పాక్పట్ల, మాదాపూర్ గ్రామాల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి మహిళలు, రైతులు, యువకులు, వృద్ధులు ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఆయా గ్రామాల్లో మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమని, మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మితే ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. రాష్ట్రంలో వంద సీట్లలో విజయం సాధించి, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి ప్రజలకు మేలు చేసే పని ఒక్కటీ చేయలేదన్నారు. జాఫ్రాపూర్, చిట్యాల్ గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ ఎస్‌లో చేరగా, వారికి కండువా కప్పి ఆహ్వానించారు. బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి వీ సత్యనారాయణగౌడ్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లాను తీసుకొచ్చిన ఘనత ఇంద్రకరణ్రెడ్డికే దక్కుతుందన్నారు.
24 గంటలు ప్రజాసేవకే అంకితమయ్యే నాయకుడిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, మండల కన్వీనర్ మోహినొద్దీన్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ మహేందర్‌రెడ్డి, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, ఏఎంసీ చైర్మన్ చిలుక రమణ, మాజీ చైర్మన్ ముత్యంరెడ్డి, సర్పంచ్‌లు సునీత ప్రకాశ్ రెడ్డి, మమత ఎల్లయ్య, ఎల్చల్ గంగారెడ్డి, నాయకులు ఆనంద్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి, పాకాల రాంచందర్, సాయారెడ్డి, సతీశ్ రెడ్డి, భూమారెడ్డి, యువరాజ్, మ్యాక ప్రేమ్‌కుమార్, నర్సారెడ్డి, హైమద్, తదితరులు పాల్గొన్నారు. సోన్, నిర్మల్ మండలా ల్లోని వివిధ గ్రామాల్లో నాయకులు ప్రచారం నిర్వహించారు. సర్పంచ్ బీ వినోద్, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణప్రసాద్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ మోహినొద్దీన్, నాయకులు అంబేకర్ ప్రసాద్, గంగాధర్ పాల్గొన్నారు.