సోన్, నవంబర్ 17 : నేను ప్రజా సేవకే అంకి తమయ్యాను. ప్రజల కష్ట్ట, సుఖాల్లో నిరంత రం వెన్నంటే ఉంటున్నా.. 365 రోజులు నిర్మల్ ప్రజ ల వెంట నడుస్తున్నా, మీ అందరికీ తెలుసు. బీజేపీ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి స్థానికుడు కాదు.. నేను స్థానికుడిని ప్రజలు ఆలోచించి ఓటు వేయా లి.. అని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ మండలం లోని కౌట్ల(కే), తాంశ, చిట్యాల్, లంగ్డాపూర్, తల్వేద, వెంగ్వాపేట్, డ్యాంగాపూర్, రాణాపూర్, ముజ్గి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. ప్రతి గ్రామంలో మంత్రి అల్లోల ఇంద్ర కరణ్‌రెడ్డికి మహిళలు, యువకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మంత్రి మాట్లాడుతూ యువతను చెడు మార్గంలో నడిపిస్తున్న మహేశ్వర్‌రెడ్డి తన పద్ధతిని మార్చుకోవాలని కోరారు.
మహేశ్వర్‌రెడ్డి 2009 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా ఉన్న సమయం లో ఏ ఒక్క పని చేశారా అని సూటిగా ప్రశ్నించా రు. అసలు ఆయనది ఈ ప్రాంతం కాదని ఎప్పు డు నిర్మల్‌లో ఉండే నాయకుడు కాదని వివరిం చారు. ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుకున్నాయని, ఇలాంటి పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా అని సూటిగా అడిగారు. ఏ గ్రామానికి వెళ్లినా బీఆర్ఎస్ పార్టీకి అపూర్వ స్పందన లభిస్తుంద న్నారు. ఈనెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ ఎస్ మాజీ రాష్ట్ర కార్యదర్శి వీ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లాను తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్న ఇంద్రకరణ్‌రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. జడ్పీ చైర్పర్సన్ విజయ లక్ష్మి, మండల కన్వీనర్ గోవర్ధన్‌రెడ్డి, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, సర్పంచ్‌లు మంతెన లక్ష్మి, లక్ష్మి, రమేశ్‌రెడ్డి, నాయకులు పాకాల రాంచందర్, ముత్యంరెడ్డి, అల్లోల తిరుపతిరెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ను గెలిపిస్తే
సారంగాపూర్, నవంబర్ 17 : కాంగ్రెస్‌ను గెలిపిస్తే మూడు గంటలే కరెంట్, బీజేపీ వస్తే మోటర్లకు మీటర్లు తప్పవని మంత్రి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 500ల మందికి పైగా కాంగ్రెస్, బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. మంత్రి, బీఆర్ ఎస్ అభ్యర్థి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను మూడో సారి భారీ మెజార్టీతో గెలిపిస్తే అందుబాటులో ఉండి మరిం త అభివృద్ధి చేస్తానన్నారు. రైతుబంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ నల్లావెంకట్రాంరెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల ఇన్చార్జి అల్లోల మురళీధర్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరావు, ఆలూర్ సొసైటీ చైర్మన్ మాణిక్‌రెడ్డి, నాయకులు రవీందర్ రెడ్డి, నాగుల రాంరెడ్డి, చిన్నయ్య పాల్గొన్నారు.
నిర్మల్ చైన్‌గేట్, నవంబర్ 17 : నిర్మల్‌లోని బాలాజీ వాడకు చెందిన 50 మంది యువకులు దేవేందర్‌యాదవ్ ఆధ్వర్యంలో మంత్రి ఇంద్ర కరణ్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మంత్రి వారికి కండువా కప్పి స్వాగతం పలికారు. నిర్మల్ అభివృద్ధి ఇంద్రకరణ్రెడ్డితోనే సాధ్యమని పార్టీలో చేరినట్లు యువకులు తెలిపారు.
నిర్మల్ అర్బన్, నవంబర్ 17 : బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు సమన్యాయం దక్కుతుందని జిల్లా అధికార ప్రతినిధి అమరవేణి నర్సాగౌడ్ పేర్కొ న్నారు. శుక్రవారం నిర్మల్‌లోని సోఫీనగర్ కాలనీ లో నూర్ మసీద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన పేర్కొ న్నారు. వార్డు ఇన్చార్జి నితిన్ రెడ్డి, నాయకులు కొండాజి రాఘవేంద్ర చారి, జొన్నల మహేశ్, నర్సింహులు, బషీర్, రమేశ్ తదితరులున్నారు.
దిలావర్పూర్ నవంబర్ 17 : అభివృద్ది చేసే నాయకుడు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని గెలిపించా లని కోరుతూ దిలావర్పూర్లో ఇంటింటా ప్రచా రం నిర్వహించారు. మంత్రి అల్లుడు రంజిత్‌రెడ్డి అధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంక్షేమ పథకాలను వివరిస్తు కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. నాయకులు కోడే నవీన్, గుణవంతురావు, శ్రీనివాస్‌రెడ్డి, నంద ముత్యం, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
నర్సాపూర్(జీ), నవంబర్ 17 : మండలం లో ని ఆయా గ్రామాల్లో బిఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతున్నది. రాంపూర్‌లో బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మండల కేంద్రంలో నాయకులు విసృతంగా ప్రచా రం నిర్వహించారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో బడు గు బలహీన వర్గాలకు ఎంతో ఉపయోగ పడు తుందని ఆర్బీఎస్ జిల్లా సభ్యులు కొండ్ర రమేశ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ సంక్షేమ పథకాలకు ప్రజ ల్లో ఎంతో ఆదరణ లభిస్తున్నదని జడ్పీటీసీ చిన్న రామయ్య పేర్కొన్నారు. సర్పంచ్ రాంరెడ్డి, ఎంపీ టీసీ మల్లేశ్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ గోపిడి గంగారెడ్డి, ప్యాట్ల రాజేశ్వర్ రెడ్డి, గ్రామ అధ్యక్షుడు శంకర్,కోఆప్షన్ మెంబర్ ఫసి, రాము, మజార్, బర్కుంట గంగారాం, బర్కుంట రాము, నారా యణ, బర్కుంట సాగర్, రాంపూర్ పాల్గొన్నారు.
మామడ, నవంబర్ 17 : సీఎం కేసీఆర్ అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని బీఆర్ఎస్ నిర్మల్ జిల్లా అధికార ప్రతినిధి ముడు సు సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంతో పాటు అరెపెల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఆరెపెల్లి సర్పంచ్ అర వింద్రావు, ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్మ ల్ జిల్లా అధ్యక్షుడు వెలుమల రాజేశ్వర్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు అంబకంటి ముత్తన్న, మోతె రాజన్న తదితరులు పాల్గొన్నారు.
సోన్, నవంబర్ 17 : మైనార్టీల్లో ఆత్మ గౌరవం పెంచిందే సీఎం కేసీఆరే అని బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి సత్యనారాయణగౌడ్ అన్నారు. నిర్మల్‌తో పాటు నిర్మల్ మండలం రత్నాపూర్ కాండ్లీ, ముఠాపూర్ గ్రామాల్లో మైనార్టీ నాయ కులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నిర్మల్ నుంచి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని కోరారు. ఎంపీ పీ రామేశ్వర్‌రెడ్డి, మండల కన్వీనర్ గోవర్ధన్‌రెడ్డి, ఇన్చార్జి సంపత్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, చంద్రశేఖర్, సమీర్, సిరాజొద్దీన్ పాల్గొన్నారు.