నార్నూర్, అక్టోబర్ 12 : ఆదివాసుల హక్కులకై పోరాడిన కుమ్రం భీంను స్ఫూర్తిగా తీసుకొని ఆదివాసులు అన్ని రంగాలలో రాణించాలని మేస్రం రూప్ దేవ్ అన్నారు. కుమ్రం భీం 85వ వర్ధంతిని అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించారు. ఆదివాసుల ఆచారం ప్రకారం పూజలు చేశారు. కుమ్రం భీం జెండాను ఆవిష్కరించారు. భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు రూప్ దేవ్ మాట్లాడుతూ.. ఆకాంక్షించారు. భీం ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఐటిడిఏ మాజీ డైరెక్టర్ మడవి మాన్కు, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ మాజీ చైర్మన్ తోడసం నాగోరావ్, సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ గజానంద్ నాయక్, నార్నూర్ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్, రాజ్ గోండు సేవా సమితి మండల అధ్యక్షుడు ఆత్రం పరమేశ్వర్, నార్నూర్ ఎస్సై అఖిల్, ప్రధాన కార్యదర్శి అర్క గోవింద్, మడవి ఆనంద్ రావు, జై భారత్ జిల్లా కోఆర్డినేటర్ పేందోర్ దీపక్, కుమ్రం సెడ్మారావ్, మేస్రం బాదిరావు, రాయి సీడం ఏత్మారావ్, రూప్ దేవ్ తదితరులున్నారు.