disabled children | తాండూర్, అక్టోబర్ 29 : ఆర్టిఫీషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఇండియా (అలిమ్ కో) సంస్థ ద్వారా ఎంపికైన ప్రత్యేక అవసరాల దివ్యాంగ పిల్లలకు తాండూర్ మండల కేంద్రంలోని ఎమ్మార్సీ కార్యాలయం భవిత సెంటర్ నందు బుధవారం మండల విద్యాధికారి ఎస్ మల్లేశం ఆధ్వర్యంలో ఉచితంగా ఉపకరణాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎంఈవో మల్లేశం మాట్లాడుతూ.. తాండూరు మండలంలోని ప్రత్యేక అవసరాల దివ్యాంగ పిల్లల వైకల్య నిర్ధారణ కోసం సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ శిబిరాలలో ఉపకరణాలు అవసరమైన వారిని గుర్తించి వివరాలు పంపించగా.. ఎస్ హీన, జీ ప్రణీత్, టీ జ్ఞానతేజన్ అనే ముగ్గురు పిల్లలు ఎంపికయ్యారన్నారు.
ఈ కార్యక్రమంలో ఐఈఆర్పీలు వెంకటేశ్వర్లు, సతీష్, ఫిజియోథెరిపిస్ట్ సాత వెంకటేష్, సీఆర్ఫీ తిరుపతి, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Landslides | భారీ వర్షానికి శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు.. ట్రాఫిక్కు అంతరాయం
Suicide: భార్యతో వీడియో కాల్లో మాట్లాడుతూ.. సౌదీలో ఆత్మహత్య చేసుకున్న భర్త
Jaanvi Swarup | హీరోయిన్గా మహేష్ బాబు మేనకోడలు..సంతోషం వ్యక్తం చేసిన మంజుల