ఆదిలాబాద్ : క్రీడలతో మానసిక, శారీరక ధృడత్వం పెరుగుతుందని, క్రీడల్లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న (Ex-minister Jogu Ramanna) క్రీడాకారులకు సూచించారు. మహాశివరాత్రి సందర్భంగా జైనథ్ మండలం దీపాయి గూడ గ్రామంలో నిర్వహించిన వాలీబాల్ ( Vollyball ) పోటీలను సోమవారం ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ( Rural Area Sportmens) ప్రోత్సహించాలన్న లక్ష్యంతో జోగు ఆశన్న, భోజమ్మల స్మారకార్థం వాలీబాల్ పోటీలను ఏర్పాటు చేశామని తెలిపారు. యువతలో స్నేహభావం పెంపొందించేందుకు పోటీలు ఎంతగానో దోహదం అవుతాయని పేర్కొన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ ముందుకు సాగాలన్నారు.
ఓడిన వారు మరింత పట్టుదలతో సాధన చేసి ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో దీపాయిగూడ మాజీ సర్పంచ్ బొల్లి గంగన్న, రైతుబంధు సమితి మండల మాజీ అధ్యక్షులు లింగారెడ్డి, మాజీ ఎంపీపీ గోవర్ధన్, లోక చైతన్య రెడ్డి, లోక కృష్ణా రెడ్డి, పండ్ల శిను, చుక్క బోట్ల కేశవ్,అల్లకొండ అశోక్, రామ్ ప్రసాద్, దేవర్ది గణేష్, బి, సంతోష్,తదితరులు పాల్గొన్నారు.