కెరమేరి,సెప్టెంబర్ 12 : సీజనల్ వ్యాధులు, విష జ్వరాలను నియంత్రించేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం కొఠారి గ్రామంలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని డీఎంహెచ్‌వో తుకారాం భట్, డీపీవో భిక్షపతి గౌడ్‌తో కలిసి సందర్శించారు. వైద్య సేవలను పరిశీలించారు.
కలెక్టర్ మాట్లాడుతూ ఇంటిం టా జ్వర సర్వే నిర్వహించాలని, వైద్య పరీక్షలు నిర్వ హించి తగు చికిత్స అందేలా అధికారులు పర్యవేక్షిం చాలని సూచించారు. గ్రామ పంచాయతీల పరిధిలో పారి శుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, అంతర్గత రహ దారులు, మురుగు కాలువల్లో పూడిక లేకుండా ఎప్పటి కప్పుడు తొలగించేలా చూడాలని ఆదేశించారు.
అనం తరం మహాలక్ష్మి పథకంలో భాగంగా గ్యాస్ రాయితీ ఉత్తర్వులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహ సీల్దార్ దత్తుప్రసాద్, ఎంపీడీవో ఆజాద్ పాషా, పంచా యతీ కార్యదర్శి, వైద్య సిబ్బంది ఉన్నారు.