నిర్మల్, ఏప్రిల్ 20(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లా మెప్మా ఆధ్వర్యంలోని స్త్రీనిధి పథకంలో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకున్నది. నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు రూ.2 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు సోషల్ ఆడిట్ ద్వారా వెలుగులో కి వచ్చింది. 2017 నుంచి 2022 వరకు ఐదేండ్లపాటు గుట్టు చప్పుడు కాకుండా అక్రమాలు యథేచ్ఛగా సాగాయి. అప్పటి మెప్మా అధికారుల పర్యవేక్ష ణ చేయకపోవడం, ఆర్థిక లావాదేవీల ఆడిటింగ్ సక్రమంగా జరపకపోవడం అక్రమార్కులకు వరం గా మారింది. అయితే మెప్మా పరిధిలో స్త్రీనిధి కోసం విధులు నిర్వహించే ఆర్పీ(రిసోర్స్ పర్సన్)లతో కొం త మంది సిబ్బంది ములాఖత్ అయి ఈ అక్రమ దందాను దర్జాగా కొనసాగించారు. తప్పుడు డ్యా క్యుమెంట్లు సృష్టించడం, బినామీల పేరిట రుణాలు తీసుకోవడం, ఆ తర్వాత తీసుకున్న రుణాలను చె ల్లించకుండా సబ్సిడీ డబ్బులను స్వాహా చేయడం వంటి తతంగానికి పాల్పడ్డారు.
మొదటి నుంచి ఆరోపణలు ఉన్నప్పటికీ అధికారులు సీరియస్‌గా దృష్టి సారించకపోవడం అక్రమాలకు ఆస్కారం ఇ చ్చింది. చాలామంది పొదుపు సంఘాల సభ్యులకు తెలియకుండానే వారి పేర్లపై మంజూరయ్యే సబ్సిడీ డబ్బులను కొందరు ఆర్పీలు కాజేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం నిర్మల్ జిల్లా వ్యా ప్తంగా మూడు మున్సిపాలిటీల పరిధిలో 2,888 స్వయం సహాయక సంఘాలు(ఎస్‌హెచ్‌జీ) ఉన్నా యి. ఇందులో 28,880 మంది మహిళలు సభ్యులున్నారు. ఇటీవల నిర్వహించిన సోషల్ ఆడిట్ ద్వారా నిర్మల్ మున్సిపాలిటీ స్త్రీనిధి రుణాల్లో అక్రమాలు వెలుగు చూడడంతో భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో కూడా పకడ్బందీ తనిఖీలు చేపట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
స్త్రీనిధి రుణాల మంజూరు, రికవరీ వ్యవహారంలో రూ.2 కో ట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు విచారణలో వెల్లడైంది. దీం తో రాష్ట్రస్థాయి మెప్మా విజిలెన్స్ విభాగం భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలలో కూడా విచారణ చేపట్టనున్నట్లు తెలిసిం ది. నిర్మల్ మున్సిపాలిటీలో 2017 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని రకాల రుణాలు, సబ్సిడీలు, ఇతర కార్యకలాపాల అంశాలపై కూడా రాష్ట్రస్థాయి బృందం లోతుగా దర్యాప్తు చే యనున్నది. మెప్మా ఉన్నతాధికారులతోపాటు ఆడిటింగ్, పో లీస్ విభాగాలు ఈ అక్రమాలపై ఇప్పటికే విచారణ ప్రారంభించాయి. ప్రాథమిక విచారణ ద్వారా రూ.2 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయినప్పటికీ, పూర్తిస్థాయి విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు బయటకు వస్తాయని చెబుతున్నారు.
నిర్మల్ మున్సిపాలిటీలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ఆర్పీలపై మెప్మా పీడీ, ఉన్నతాధికారులకే కాకుండా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్పీ అక్రమాల గు ట్టును రట్టు చేసేందుకు ఓ పోలీసు అధికారిని ప్రత్యేకంగా విచారణ కోసం రంగంలోకి దించారు. సం బంధిత పోలీసు అధికారి ఇటీవలే నిర్మల్ మున్సిపాలిటీలోని మెప్మా కార్యాలయంలో రికార్డులను తని ఖీ చేసి అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. తన వి చారణ నివేదికను ఎస్పీకి అందించారు. దీంతో ఎ స్పీ సంబంధిత మెప్మా అధికారులకు ఆ నివేదికను అందజేయడమే కాకుండా, అవినీతికి పాల్పడ్డ ఐదుగురు ఆర్పీలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందు కు అవసరమైన కేసులను నమోదు చేశారు.
ఇదిలా ఉండగా ఈ ఐదుగురితోపాటు మరికొంత మంది ఆర్పీల ప్రమేయం కూడా ఉన్నట్లు ఫిర్యాదులున్నా యి. ఈ కోణంలో కూడా అటు మెప్మా అధికారు లు, ఇటు పోలీసు అధికారులు రహస్యంగా విచార ణ జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికైనా తమ సంఘాల పేర్ల మీద స్త్రీనిధి రుణాలు, సబ్సిడీలను మింగిన ఆర్పీలపై విచారణ జరిపి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.