తాంసి, ఏప్రిల్ 25 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత రైతులకు మూడెకరాల భూమి ఇచ్చి ఉపాధి కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపి అన్నం పెట్టారని..అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సరార్ ఆ రైతులకు కనీసం నీళ్లు కూడా ఇస్తలేదని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని జామిడి గ్రామంలో తాంసి మండల కాంగ్రెస్ యువజన నాయకుడు అశోక్ ఆధ్వర్యంలో 250 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం అశోక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అప్పులు చేస్తున్నదని అభివృద్ధి చేయడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజల స మస్యలను పరిషరిస్తున్నారని కొనియాడారు. ముందుగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు మంగళహారతులు డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు.
నూతనంగా ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రం భవనాన్ని ప్రారంభించి చిన్నారులతో ముచ్చటించారు. అనంతరం ఏర్పా టు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో గద్దెనెకి ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమయిందన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇచ్చి కేసీఆర్ అన్నం పెడి తే.. కాంగ్రెస్ ప్రభుత్వం జామిడి గ్రామంలో 18 మంది రైతులకు బోర్లు తవ్వించి సాగునీరు అందించడం లేదని మండిపడ్డారు. ఆ రైతుల సమస్యలను త్వరలోనే పరిషరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కాంగ్రెస్ రాగానే మళ్లీ సమైక్య రాష్ట్రంలోని పాత రోజులు వచ్చాయని కరెంటు కోతలు ప్రజలను వేధిస్తున్నాయని, కల్యాణలక్ష్మితో తులం బంగారం, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఆసరా పింఛన్ల పెంపు, మహాలక్ష్మి పథకంలో మహిళలకు ప్రతి నెలా రూ.2500 ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేశారని గుర్తు చేశారు.
‘పథకాలు ఇస్తాం అన్నాం.. కానీ అధికారంలోకి వస్తామని అనుకోలేదు’ అని కాంగ్రెస్ పార్టీ నాయకులే రచ్చబండల వద్ద వాపోతున్నారని ఎద్దేవా చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తప్పక గుణపాఠం చెబుతారని చెప్పారు. ఎన్నికలెప్పుడు వచ్చినా బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ బోథ్ నియోజకవర్గ అధికార ప్రతినిధి కిరణ్ కుమార్, మండల కన్వీనర్ వినోద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమణ బీఆర్ఎస్ నాయకులు తాజా మాజీ సర్పంచ్ స్వప్న రత్న ప్రకాశ్, మలపతి అశోక్, తిరుమల్ గౌడ్, ప్రీతం రెడ్డి, మహేందర్, రఘు, రజినీకాంత్ రెడ్డి, ఉత్తం, అండె అశోక్, భూమన్న, సాయినాథ్, సురేశ్, గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా ఎలతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే రజతోత్సవ సభను బోథ్ నియోజకవర్గంలోని ప్రజలు బీఆర్ఎస్ నాయకులు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు, అభిమానులు సకాలంలో హాజరయ్యేలా మండలాల నాయకులు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
భైంసా, ఏప్రిల్, 25 : కేసీఆర్ త్యాగంతో ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రంలో గులాబీ జెండానే ప్రజలకు అండ అని ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ సమితి సభ్యురాలు డాక్టర్ పడకంటి రమాదేవి అన్నారు. శుక్రవారం తన నివాసంలో కుంటాల మండలం లింబా (బీ) గ్రామ మాజీ సర్పంచ్ పెద్దకాపు గజ్జారాం, ముథోల్ మండలం మచ్కల్ గ్రామానికి చెందిన పుండలిక్, అవదూత్ బీఆర్ఎస్లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి రమాదేవి ఆహ్వానించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కార్యకర్తలు, నాయకులు భారీగా తరలిరావాలని ఆమె కోరారు.