మంచిర్యాల అర్బన్ : మంచిర్యాల (Manchiryala district) జిల్లా కేంద్రంలోని గోపాల్వాడలో కన్నవేణ రాజమణి (35) అనే వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు మంచిర్యాల పట్టణ ఎస్సై కిరణ్ కుమార్ ( SI Kirankumar ) తెలిపారు. అనారోగ్య కారణాలతో రాజమణి గత కొన్ని రోజులుగా మనస్తాపానికి గురై గురువారం తెల్లవారుజామున ఇంట్లో హాలులో ఫ్యానుకు ఉరి వేసుకొని ( Hanging ) మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారని ఆయన వెల్లడించారు.
మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మార్చురీ గదికి తరలించామని ఎస్సై పేర్కొన్నారు. ఆమె మృతికి పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేయనున్నట్లు వివరించారు. మహిళకు భర్త సతీష్, సాయి కీర్తన, సాయి వినయ్ ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆయన తెలిపారు.