హాజీపూర్ : హాజీపూర్, లక్షట్టిపెట్ మండలాల్లో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ( Yellampally Project ) ముంపు బాధితులకు పెండింగ్ లో ఉన్న బకాయిలు ( Pending Bills ) చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు రఘునాథ్ వెరబెల్లి తహసీల్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ముంపు ప్రాంత బాధితులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్ర నిర్వహించారు.
ఎమ్మెల్యేగా గెలిచిన వందరోజుల్లో నష్ట పరిహారం ఇప్పిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు 18 నెలలు గడిచిన ఇప్పటి వరకు బాధితులకు న్యాయం చేయలేదన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ముంపు బాధితులకు పరిహారం చెల్లించే వరకు బీజేపీ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎల్లంపల్లి ముంపు గ్రామాల ప్రజలు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.