నెన్నెల : కాళేశ్వరం ప్రాజెక్ట్ పై రెండు సంవత్సరాలుగా ఆ కమిటీ ఈ కమిటీ అంటూ చేసిన ఎత్తుగడలు సాగక పోవడంతో కేసీఆర్ ను బద్నాం చేసి కేసుల్లో ఇరికించాలనే కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐకి కేసు అప్పగిస్తుందని మంచిర్యాల జిల్లా నెన్నెల మండల బీర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పంజాల విద్యాసాగర్ గౌడ్ విమర్శించారు. మంగళవారం మండలం కేంద్రంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పై బురదజల్లే ఆరోపణలు చేస్తుందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కేసీఆర్ ను ఏమీ చేయాలేరన్నారు.
రెండేండ్లుగా ఇక్కడి కమిటీలు చేసిన విచారణ పై ప్రభుత్వానికి నమ్మకం లేదని అన్నారు. తప్పుడు కేసు పెట్టి కేసీఆర్ను బద్నాం చేసే రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలు మరిచి పోయి బురద రాజకీయాలు చేస్తున్నరని, కనీసం రైతులకు బస్తా యూరియా ఇవ్వలేని పార్టీ కాంగ్రెస్ అని మండి పడ్డారు. ఈ కార్యక్రంలో పీఏసీఎస్ చైర్మన్ మల్లేష్, పార్టీ నాయకులు సింగతి రామచందర్, ప్రతాప్ రెడ్డి, ఇబ్రహీం, పురంశెట్టి తిరుపతి, గోపాల్, తొకల తిరుపతి, గొర్లపల్లి బాపు, మల్లేష్, రమేష్, మల్లేష్, తిరుపతి, ప్రవీణ్ యాదవ్, శంకర్, అంజన్న, మొగిలి, కృష్ణ, శ్రీశైలం, మురళి తదితరులు పాల్గొన్నారు.