కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో ఎలాంటి క్షుద్ర పూజలు జరగ లేదని, క్షుద్రపూజలపై వస్తున్న పుకార్లు నమ్మవద్దని కాసిపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇటీవల కాలంలో కాసిపేట మండల కేంద్రంలో ఇళ్ల ముందు నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, ముగ్గులు వేసి మంత్రాలు చేసినట్లు పెట్టడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ మేరకు ప్రజలు ఎవరు కూడా ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మవద్దన్నారు.
ఎవరైనా రాత్రి పూట మీ ప్రాంతంలో అనుమానస్పదంగా తిరుగుతున్నట్లయితే ఇలాంటివి చేస్తున్న వారు మీకు ఎవరైనా తెలిసినట్లయితే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని లేదా 100 నెంబర్కు కాల్ చేయాలని సూచించారు. వారిపై కఠినమైన చర్య తీసుకుంటామని పేర్కొన్నారు. గ్రామల్లో పోలీస్ కళా బృందంతో అవగాహనా కల్పిస్తామన్నారు. మూఢ నమ్మకాలతో మానసిక, శారీరక, రుగ్మతలకు గురి కాకుండా ప్రజలలో చైతన్యం తీసుకువస్తున్నామని చెప్పారు.