కాసిపేట, సెప్టెంబర్ 15: మంచిర్యాల జిల్లా కాసిపేట మండల పరిషత్ కార్యాలయం ముందు ఉపాధి హామీ కూలీ డబ్బులు చెల్లించాలని సోమవారం తాటిగూడ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ కూలీ డబ్బులు అందించడం లేదని, మే, జూన్ నెలలో పని చేసినవి కూడా ఇంత వరకు చెల్లించలేదన్నారు.
గ్రామస్తులందరికి ఉపాధి కూలీ డబ్బులు రాలేదని, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈజీఎస్ ఏపీవో నవీన్ కుమార్కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మడావి వెంకటేశ్, మేండ్రపు రాజన్న, మడావి మధుకర్, శేఖర్, జంగు బాయి, ప్రమీలా తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.