Farmers | నెన్నెల : కాంగ్రెస్ సర్కార్ పాలనలో రైతన్నలకు తిప్పలు తప్పడం లేదు. ఆరుగాలం పండించిన పంటను అమ్ముకుందామంటే కష్టాలు తప్పడం లేదు. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
సారూ మా వడ్లు కాంట చేసి ఇరవై రోజులయింది.. కాంట అయిన బస్తాలను లారిలో ఎక్కించండి అంటే సదరు డీసీఎంస్ నిర్వాహకుడు, అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదేందీ అని అడిగితే కాంట చేసిన బస్తాలను మరలా వడ్లను కింద పోసి తేమ చూసిన తర్వాతే కాంట చేయాలని అంటున్నారని మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లికి చెందిన రైతులు మెండే కిష్టయ్య, కాల్వ రాజాం, బండి రమేష్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు వారంతా శనివారం తాసిల్దార్ కార్యాలయం ముందు బస్తాలు తీసుకు వచ్చి వారి ఆవేదనను తహసీల్దార్ శ్రీనివాస్‌కు చెప్పుకున్నారు. సారు వాళ్లు పట్టించు కోవడం లేదు మీరన్నా మా వడ్లను తేమ చూసి పంపండి.. అంటూ వేడుకున్నారు. పలుకుబడి ఉన్న వాళ్ళవి తేమ కూడా చూడడం లేదని తమ వడ్లు ఎండలకు ఎండి తేమ 9 వరకు వచ్చిందని రైతులు చెప్పారు. మే 10న కాంట అయిన బస్తాలను ఖాళీ చేయమంటే ఎలా సారు. మళ్లీ కాంట చేస్తే హమాలీ ఛార్జీలు మా మీదనే పడుతున్నాయని ఆందోళన చెందారు.
ఇది కావాలనే మమ్ములను వేదిస్తున్నారని ఒక వేళ తమ బస్తాలను లోడింగ్ చేయకుంటే మమ్ములను వేధిస్తున్న వారి పేర్లు రాసి ఇక్కడే చస్తామని కన్నీరు పెట్టారు. దీంతో తహసీల్దార్ శ్రీనివాస్ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని రైతులకు నచ్చజెప్పారు.
This Weekend OTT | ‘జెట్ లీ’, ‘కర’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన వెబ్ సిరీస్‌లు, సినిమాలివే!
Rajamouli | ‘వారణాసి’కి మళ్లీ లీకుల బెడద.. జక్కన్న మౌనం వెనుక అసలు వ్యూహం ఏంటి?
Transgender Influencer: మున్నిపల్ ఎన్నికల్లో గెలిచిన ట్రాన్స్‌జెండర్ ఇన్ఫ్లూయెన్సర్