బెల్లంపల్లి : బెల్లంపల్లి కాంటా కూడలిని అభివృద్ధి చేసే నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదివారం కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టియుఎఫ్ఐడిసి కోటి రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. పనులు పూర్తయితే పట్టణంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడి ప్రజలకు రవాణా సులభతరమవుతుందని వెల్లడించారు.
అభివృద్ధి పనులకు ఈ వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. బెల్లంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి తన వంతు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్, నాయకులు మత్తమారి సూరిబాబు, మునిమండ రమేష్, దావ రమేష్, మాజీ కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.