లక్షెట్టిపేట రూరల్, జూలై 3 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం పర్యావరణ సమతుల్యతకు దోహదం చేస్తుందని, చెట్లు స్వచ్ఛమైన ప్రాణవాయివు అందిస్తాయని మంచిర్యా ల ఎమ్మెల్యే దివాకర్ రావు పేర్కొన్నారు. శనివారం మండలంలోని కొత్తూరు, ఎల్లారం, వెంకట్రావుపేట, దౌడేపల్లి, పాత కొమ్ముగూడెం, చందారం, కొత్తకొమ్ముగూడెం, రంగపేట గ్రామాల్లో జరిగిన హరితహారం కార్యక్రమాల్లో స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఎమ్మెస్ చైర్మన్ తిప్పని లింగన్న, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీవో అజ్మత్ ఆలీ, నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్, మాజీ డీసీఎమ్మెస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షుడు అంకతి రమేశ్, పార్టీ సీనియర్ నాయకులు జగన్మోన్ రెడ్డి, ఎంపీటీసీ బత్తుల సత్తయ్య, సర్పంచ్‌లు జైనేని సుజాత, ఉప సర్పంచ్‌లు మోటపల్కుల శ్రీనివాస్, పొన్నంతిరుపతి గౌడ్, పంచాయితీ కార్యదర్శులు రాజేశ్, మౌనిక, కాండ్రపు శంకరయ్య, గుంటుకు నగేశ్, వేణు, భీమన్న, టీఆర్ఎస్ సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, పార్టీ కార్యకర్తలు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
పల్లె ప్రగతిలో భాగస్వాములవ్వాలి
తాండూర్, జూలై 3 : పల్లె ప్రగతి కార్యక్రమంలో
ప్రజలందరూ భాగస్వాములు కావాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు. శనివారం తాండూర్ మండలంలోని రేచినిలో ఎమ్మెల్యే చిన్నయ్య పర్యటించి, పలు అభివృద్ధి పనులలో పాల్గొన్నారు. ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. సర్పంచ్‌లు, నాయకులు, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సాలిగామ బానయ్య, సర్పంచ్ చింతపురి దుర్గుబాయి, ఎంపీటీసీ శంకర్, ఎంపీడీవో శశికళ, ఎస్ఐ కిరణ్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులు దత్తుమూర్తి, ఉప సర్పంచ్ రాజయ్య, కార్యదర్శి వసంత, వార్డు సభ్యులు, కో ఆప్సన్ సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజ లు, తదితరులు పాల్గొన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం పల్లె ప్రగతి పనులు కొనసాగాయి. ఈ కార్యక్రమాల్లో సర్పంచులు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, వెలుగు సీఏలు, గ్రామస్తులున్నారు.
స్ప్రింక్లర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
బెల్లంపలి ్లరూరల్, జూలై 3: బెల్లంపల్లి మండలంలోని కన్నాల రైతు వేదిక వద్ద శనివారం ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన కింద అర్హులైన రైతులకు సబ్సిడీపై మంజూరైన స్ప్రింక్లర్లను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యవసాయశాఖ అధికారుల సమక్షంలో పంపిణీ చేశారు. రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పొందుతున్న అవకాశాలను సద్వినియోగించుకోవాలని సూచి ంచారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి అవిశ్రాంతంగా పని చేస్తుందన్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఇంకా 10 యూనిట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కన్నాల, అంకుశం గ్రామాల్లో అర్హులైన రైతులను గుర్తించి పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, ఎంపీపీ గోమాస శ్రీనివాస్, సర్పంచ్ జిల్లపల్లి వెంకటస్వామి, బెల్లంపల్లి ఏడీఏ సురేఖ, ఏవో సుద్దాల ప్రేమ్‌కుమార్, ఏఈవో నాగదీప్తి, నాయకులు జిల్లపల్లి వెంకటస్వామి, వెంబడి సురేశ్ , పాయవేని మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
వెయ్యి మొక్కలు నాటాలి
బెల్లంపల్లిటౌన్, జూలై 3 : మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో ఏర్పాటు చేసిన ప్రకృతి వనంలో వెయ్యి మొక్కలు నాటాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు. అంబేద్కర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాన్ని శనివారం ఆయన మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతతో కలసి ప్రారంభించారు. 14, 15 వార్డుల్లో నిర్వహించిన వార్డు కమిటీ సమావేశాలకు ముఖ్య అతిధులుగా హాజరై మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, ఎంపీపీ గోమాస శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డునారాయణ, సీనియర్ నాయకులు నెల్లికంటి శ్రీధర్, కౌన్సిలర్లు రామకృష్ణ, రేణుక, ఆర్పీలు పాల్గొన్నారు. 11వ వార్డు అంగన్వాడీ కేంద్రం ఆవరణలో జరిగిన వార్డు సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, కమిషనర్ జంపాల రజిత, ఎంపీపీ గోమాస శ్రీనివాస్, కౌన్సిలర్లు బొడ్డు నారాయణ, గెల్లిరాజలింగు, కొక్కెర చంద్రశేఖర్ పాల్గొన్నారు. 10వ వార్డు రైల్వే స్టేషన్ ఏరియా బై పాస్ రోడ్డు వద్ద కౌన్సిలర్ కొక్కెర చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆర్పీ కృష్ణవేణి, నాయకులు సిరవేని రాజ్‌కుమార్, మల్లక్క, వరక్క, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
నేడు చెన్నూర్‌లో ప్రభుత్వ విప్ సుమన్ పర్యటన
చెన్నూర్, జూలై 3: చెన్నూర్‌లో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదివారం పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికలాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా చెన్నూర్ పట్టణంలో మొక్కలను పంపిణీ చేయనున్నారు.
ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలి : కలెక్టర్
భీమారం, జూలై 3 : ఖాళీ ప్రదేశాలు, రోడ్డు ఇరువైపులా మొక్కలు నాటాలని కలెక్టర్ భారతీ హోళికేరి ప్రజా ప్రతినిధులు, అధికారులకు సూచించారు. శనివారం భీమారంలో రోడ్డుకిరువైపులా, డివైడర్ మధ్యలో మొక్కలు నాటారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి ఖాజా నజీం అలీ , ఎంపీడీవో శ్రీనివాస్ , ఎంపీవో శ్రీపతి బాపు , జడ్పీటీసీ సభ్యురాలు భూక్య తిరుమల నాయక్ , సర్పంచ్ గద్దెరాంరెడ్డి , నేషనల్ హైవే డిప్యూటీ ఈఈ అన్నయ్య , పంచాయతీ కార్యదర్శి సర్వశ్రేష్ఠ , ఈసీ శ్రీనివాస్ తదితరులున్నారు.
ప్రకృతి వనాలతో ఆహ్లాదకర వాతావరణం
దండేపల్లి, జూలై 3 : పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం అందించేందుకే పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసినట్లు మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. వీటితో పాటు ప్రతి మండలానికీ బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. శనివారం మండలంలోని వెల్గనూర్ జీపీ పరిధిలోని అందుగులపేట వద్ద బృహత్ పల్లె ప్రకృతి వనానికి 10 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. అధికారులు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో శేషాద్రి, మండల ప్రత్యేకాధికారి ప్రకాశ్, ఎంపీడీవో టీ శ్రీనివాస్, ఎంపీవో మేఘమాల, ఏపీవో దుర్గాదాస్, ఈజీఎస్ సిబ్బంది ఉన్నారు.
మంచిర్యాల మున్సిపాలిటీలో..
మంచిర్యాలటౌన్, జూలై 3: మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల్లో ఆయా వార్డు కౌన్సిలర్లు, వార్డు ఆఫీసర్లు మురుగు కాలువలను శుభ్రం చేయించడం, చెత్త, చెదారంతోపాటు పిచ్చి మొక్కలను తొలగించడం లాంటి కార్యక్రమాలు చేపట్టారు. మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య ఎనిమిదో వార్డులో బ్లీచింగ్ పౌడర్‌ను చల్లారు. కమిషనర్ స్వరూపారాణి రాంనగర్లో డ్రైనేజీని పరిశీలించారు. అధికారులకు సూచనలు చేశారు. వార్డు కమిటీ సభ్యులు మొక్కలు నాటారు.
చెన్నూర్ మున్సిపాలిటీలో..
చెన్నూర్, జూలై 3: చెన్నూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ అర్చనా గిల్డా, వైస్ చైర్మన్ నవాజొద్దీన్, కమిషనర్ ఖాజా మొయిజొద్దీన్లు కౌన్సిలర్లతో కలసి శనివారం పలు వార్డుల్లో పర్యటించారు. పారిశుధ్య పనులను వారు పరిశీలించి, సమస్యలను కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో గుర్తించిన సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.
విద్యుత్ స్తంభాలకు మరమ్మతులు
బెల్లంపల్లిరూరల్, జూలై 3: బెల్లంపల్లి మండలంలోని తాళ్లగురిజాల గ్రామంలో విద్యుత్ స్తంభాలను విద్యుత్‌శాఖ ఏడీ (ఆపరేషన్) కె.శ్రీనివాస్ , ఏడీ (క్వాలిటీ కంట్రోలర్) మోహన్‌రెడ్డి సరి చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎం.సురేందర్‌గౌడ్, కో ఆప్షన్ సభ్యులు ఎండీ.చాంద్‌పాషా, గ్రామపంచాయతీ ప్రత్యేకాధికారి ఎన్.ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి ఏదుల లక్ష్మి, లైన్‌మన్ శంకర్, వార్డు సభ్యులు బీ శ్యామ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కోటపల్లి మండలంలో..
కోటపల్లి, జూలై 3 : మండలంలో జనగామ సర్పంచ్ గట్టు లక్ష్మణ్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఎసన్వాయిలో సర్పంచ్ సీమా నాయక్, పంచాయతీ కార్యదర్శి శ్రీవిద్య ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేయించారు. లింగన్నపేటను ఎంపీడీవో కే భాస్కర్ సందర్శించి, పరిశుభ్రత పాటించని రెండు కిరాణా దుకాణాల యజమానులకు రూ.500 చొప్పున జరిమానా విధించారు. వెల్మపల్లిలో జరుగుతున్న పారిశుధ్య పనులను ఎంపీవో సత్యనారాయణ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సద్దనపు శిల్ప, రమాదేవి, శైలజ తదితరులున్నారు.
పిచ్చి మొక్కల తొలగింపు
చెన్నూర్ రూరల్, జూలై 3 : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చెన్నూర్ మండలంలోని కిష్టంపేట గ్రామంలోని చెరువు కట్ట పై ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. సర్పంచ్ బుర్ర రాకేశ్ గౌడ్ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపట్టారు.
దేవాపూర్‌లో..
కాసిపేట, జూలై 3 : మండలంలోని దేవాపూర్‌లో అంబేద్కర్ చౌక్ వద్ద కాలనీ వద్ద కల్వర్ట్ రోడ్డుపై గుంతలను అధికారులు, నాయకులు పూడ్చి వేయించారు. కాలనీల్లో పర్యటించి సమస్యల వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కవిత, నాయకులు కైలాస్, జంగు, సతీశ్, సిడం శంకర్, కసాడి రమేశ్, డీలర్ మల్లేశ్, సిబ్బంది పాల్గొన్నారు. దేవాపూర్‌లోని పార్క్‌ను మండల నాయకులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. మరిన్ని సౌకర్యాలు, సదుపాయాల ఏర్పాటుకు వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొల్లు రమణారెడ్డి, సర్పంచ్ ఆడె జంగు, మడావి అనంతరావు, టీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు గడ్డం పురుషోత్తం, ఉపాధ్యక్షుడు బింగి శ్రీనివాస్, మల్లేశ్ పాల్గొన్నారు.
ప్రకృతి వనం ప్రారంభం…
కాసిపేట మండలంలోని గట్రావ్‌పల్లిలో పల్లె ప్రకృతి వనాన్ని సర్పంచ్ పెంద్రం రాజు ప్రారంభించారు. మొక్కలు నాటారు. ఎంపీటీసీ భీంరావు, కార్యదర్శి తనూజ, ఈజీఎస్ టీఏ అష్మా, తిరుపతి, కారోబారి భీంరావు, గ్రామస్తులున్నారు.
గొల్లపల్లిలో శ్రమదానం
నెన్నెల, జూలై 3 : పల్లెప్రగతిలో భాగంగా మండలంలోని గొల్లపల్లి గ్రామంలో శ్రమదానం కార్యక్రమం చేపట్టారు. సర్పంచ్ ఇందూరి శశికళ ఆధ్వర్యంలో రోడ్ల వెంట పాఠశాలల్లో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. రోడ్లపై ఉన్న మురుగు నీరు, బురదను తొలగించారు. అనంతరం వాటిపై బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. నెన్నెల, చిత్తాపూర్, కొత్తూర్, వెంకటాపూర్, ఆవుడం , గంగారంలో శ్రమదానం చేపట్టారు. సర్పంచ్‌లు సత్తమ్మ, పద్మ, శారద, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
మందమర్రి మండలంలో..
మందమర్రి రూరల్, జూలై 3 : మందమర్రి మండలంలో పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శనివారం అధికారులు, ప్రజా ప్రతినిధులు పొన్నారం, వెంకటాపూర్ గ్రామాలను సందర్శించి ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమాల్లో మండల ప్రత్యేక అధికారి సీపీవో కృష్ణయ్య, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఎంపీపీ గుర్రం మంగ, జడ్పీటీసీ ఏల్పుల రవి, ఎంపీవో షేక్ సప్ధర్ ఆలీ, ఏపీవో రజీయా సుల్తానా, గుర్రం శ్రీనివాస్ గౌడ్, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా మందమర్రి మున్సిపాలిటీలోని 15వ వార్డులో అధికారులు, ప్రజా ప్రతినిధులు పర్యటించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలకు చెత్త బట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ గాదె రాజు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జే. రవీందర్, యూత్ నాయకులు భట్టు రాజ్‌కుమార్, వార్డు ఇన్చార్జి శిరీష్, సంకినాల రాజు, తిరుపతి, ఐకేపీ ఆర్పీ లావణ్య పాల్గొన్నారు.
వేమనపల్లి మండలంలో..
వేమనపల్లి, జూలై 3 : మండలంలోని సుంపుటం గ్రామంలో ఎంపీడీవో లక్ష్మీనారాయణ సర్పంచ్ కొండగొర్ల బాపుతో కలిసి మొక్కలు నాటారు. కల్లెంపల్లిలో సర్పంచ్ కుస్రం పద్మ, క్యాతనపల్లిలో సర్పంచు ఆవులమారి దుర్గక్క ఎంపీవో అనిల్‌కుమార్ మొక్కలు నాటారు. మండల కేంద్రంలో సర్పంచు కుబిడె మధుకర్ పిచ్చి మొక్కలను శ్రమదానం చేసి తొలగించారు. ఎంపీడీవో, ఎంపీవోలు పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ప్రవీణ్, సుదర్శన్, జాఫర్, అంగన్వాడీ టీచర్ రాణి తదితరులు పాల్గొన్నారు.
కన్నెపల్లి మండలంలో..
కన్నెపల్లి, జూలై 3 : పల్లె ప్రగతి లో భాగంగా భీమిని పంచాయతీలోని పల్లె ప్రకృతి వనంలో, లక్ష్మీపూర్ గ్రామంలోని శ్మశాన వాటిక సమీపంలో, అక్కపల్లిలోని రోడ్లకిరువైపులా ఎంపీపీ పోతురాజుల రాజేశ్వరి లక్ష్మణ్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి డివిజన్ డీఎల్పీవో ఫణీందర్, ఎంపీడీవో రాధాకిషన్, ఎస్ఐ కొమురయ్య, ఎంపీవో విజయ్ ప్రసాద్, ఏపీవో భాస్కర్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నిరంజన్‌గుప్తా, సర్పంచులు ఎల్లాగౌడ్, సంతోష్, కమల, ఈసీ నాగేందర్ పాల్గొన్నారు.
నస్పూర్ మున్సిపాలిటీలో..
సీసీసీ నస్పూర్, జూలై 3 : నస్పూర్ మున్సిపాలిటీలో పలు వార్డుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతూ, మొక్కలు నాటుతున్నారు. వాటర్ట్యాంకుల్లో బ్లీచింగ్, రోడ్లు, డ్రైన్లు శుభ్రం చేయాలని, విద్యుత్ పోల్స్, వైర్లు లేని చోట వెంటనే ఏర్పాటు చేయాలని, వాడల్లో సమస్యలను పరిష్కరిం చాలని సిబ్బందికి మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, కమిషనర్ తుంగపిండి రాజలింగుసూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ సాయికిరణ్, కౌన్సిలర్లు ఉన్నారు.
జైపూర్ మండలంలో..
.జైపూర్, జూలై 3: మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రగతి కార్యక్రమాలు చురుగ్గా నిర్వహించారు. మండలంలోని రామారావుపేట, ఇందారం, టేకుమట్ల, శెట్పల్లి, గంగిపెల్లి, కుందారం, కాన్కూర్ గ్రామాలతో పాటుగా పలు గ్రామాల్లో పారిశుద్య పనులు నిర్వహించారు. మండల ప్రత్యేకాధికారి ప్రభాకర్‌రావు, ఎంపీడీవో నాగేశ్వర్‌రెడ్డి, ఎంపీవో సతీశ్‌కుమార్‌తో పాటు ఆయా గ్రామాల ప్రత్యేకాధికారులు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.