కాసిపేట: మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ (Kumar Deepak) కాసేపు టీచర్‌గా మారారు. జిల్లాలోని కాసిపేట మండలం కోనూర్, తాటిగూడ గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ స్థానిక పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా సామర్ధ్యాలను పరిశీలించారు. విద్యార్థులతో చదివించడంతో పాటు వారికి పలు అంశాలను బోధించారు. విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపారు. ఉపాధ్యాయుల హాజరు పట్టిక పరిశీలించి సమయపాలన పాటించాలని టీచర్లను ఆదేశించారు. పాఠ్యాంశాల బోధనలో కార్యాచరణ ప్రకారంగా తరగతులు నిర్వహించాలని సూచించారు.
కాగా, మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగనున్న పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్‌ను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 49 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 9,189 మంది విద్యార్థులు, 221 మంది ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు.