రిమాండ్.., రూ.40 వేల నగదు స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఖానాపూర్ సీఐ శ్రీధర్, ఎస్ఐ రాములు
ఖానాపూర్ టౌన్, ఏప్రిల్ 23 : ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన ముగ్గురిని ఖానాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం సీఐ శ్రీధర్, ఎస్ఐ రాములు వివరాలు వెల్లడించారు. మండలంలోని సుర్జాపూర్‌కు చెందిన ముగ్గురు యువకులు కొంపెల్లి నరేందర్ (28), ఆయన సోదరుడు కొంపెల్లి రవీందర్(35), జాడి మహేశ్(29) డబ్బులు సంపాదించేందుకు సులువైన మార్గం ఎంచుకున్నారని తెలిపారు. 2019 నుంచి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని పలువురు నిరుద్యోగుల నుంచి ఇప్పటి వరకు రూ.3లక్షలు వసూలు చేశారని పేర్కొన్నారు. ఈ నెల 18న మస్కాపూర్‌కు చెందిన బాధితుడు షేక్ షారూఖ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిని పట్టుకున్నామన్నారు. నిందితుల నుంచి రూ.40 వేలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వారిని చాకచక్యంగా పట్టుకున్న ఐడీపార్టీ కానిస్టేబుల్ ఉశన్న, హోంగార్డు శ్రీనివాస్‌ను అభినందించారు.
ఇవి కూడా చదవండి
విజయ్ మాస్టర్ సినిమాకు ఊహించని షాక్
మాజీ ఎమ్మెల్యే సాయిరెడ్డి మృతి పట్ల వినోద్ కుమార్ సంతాపం