Kasipeta Sarpanches | కాసీపేట, డిసెంబర్ 30 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం కాసిపేట మండలంలోని 22 గ్రామ పంచాయతీల్లో ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్పంచులకు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. కాసీపేట మండల పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్పంచులను శాలువాలతో సత్కరించారు. ముందుగా ఎంపీడీవో సత్యనారాయణ సింగ్, తహసీల్దార్ సునీల్ కుమార్ దేశ్ పాండే, ఎంపీవో శేఖ్ సఫ్టర్ ఆలీలు సర్పంచులకు సంబంధించి పలు అంశాలపై అవగాహన కల్పించారు.
అనంతరం సర్పంచులకు సన్మానం చేశారు. సర్పంచులు కొండాపూర్ ఒల్లెపు శైలజ, కోనూర్ పీఠం మల్లేష్, పల్లంగూడ దుస్స విజయ, తాటిగూడ మడావి వెంకటేష్, మద్దిమాడ ఆడె దివ్య, కాసిపేట బదావత్ నీలా, ముత్యంపల్లి చాకటి సుగుణ, లంబాడితండా (కే) బోడ బలరాం, దేవాపూర్ సిడం రాందాస్, పెద్దనపల్లి కల్వల శరత్, కోమటిచేను జాడి మాణిక్య, చిన్న ధర్మారం భూక్య స్వప్న, బుగ్గగూడెం నవనందుల పుష్పలత, వెంకటాపూర్ పెంద్రం శంకర్, గట్రావ్ పల్లి ఆత్రం జంగు బాయి, సోనాపూర్ ఆర్క మహేందర్, లంబాడితండా(డీ) బానోత్ సహస్ర, ధర్మారావుపేట జుగునాక రాధ, మల్కెపల్లి కోట్నాక రఘు, రొట్టెపల్లి ఆత్రం కళావతి, సోమగూడెం(కే) కున్సోత్ చైతన్యలను సన్మానించారు.
అధికారులు, సర్పంచులు సమన్వయంతో గ్రామ పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తామని అధికారులు, సర్పంచులు పేర్కొన్నారు. అనంతరం ఎంపీడీవో సత్యనారాయణ సింగ్, ఎంపీవో షేక్ సఫ్దర్ అలీకి సర్పంచులు, కార్యదర్శులు శాలవాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ సింగ్, తహసీల్దార్ సునీల్ కుమార్ దేశ్ పాండే, ఎంపీవో శేఖ్ సఫ్టర్ అలీ, సూపరిడెండింట్ లక్ష్మయ్య, సీనియర్ అసిస్టెంట్ ఆకుల లక్ష్మీ నారాయణ, జూనియర్ అసిస్టెంట్ తిరుపతి, ఏవో చల్ల ప్రభాకర్, పీఆర్ ఏఈ జగన్, ఏపీఎం రాజ్‌కుమార్, ఆయా పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు.
Sannia Ashfaq: నా ఇంటిని ముక్కలు చేశారు.. విడాకులపై పాకిస్థాన్ క్రికెటర్ భార్య ఆవేదన