కాసిపేట, డిసెంబర్ 17: మంచిర్యాల జిల్లా కాసిపేట (Kasipet) మండలంలోని పెద్దాపూర్ కోలంగూడలో శ్రీశ్రీ లోవ భీమయ్యక్ స్వామి జాతర (Lova Bheemaiahk Jathara) అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. బుధవారం నుంచి మూడు రోజలు పాటు ఈ జాతర కొనసాగునుంది. ఈ మేరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పెద్దాపూర్ కోలంగూడెలోని ఆదివాసీల ఆరాధ్య దైవం శ్రీశ్రీ లోవ భీమయ్యక్ దేవస్థానం వద్ద బుధవారం నుంచి పూజలు ప్రారంభమై మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలతో జాతర నిర్వహించనుండగా శుక్రవారంతో ముగయనున్నాయి.
ఆదివాసీ సాంప్రదాయాల మేరకు పూజలను చేయనున్నట్లు, ఉమ్మడి జిల్లా నుంచి భక్తులు అధిక సంఖ్యలో పూజలో పాల్గొంటారని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ ఆత్రం మహేష్ తెలిపారు.
