కాసిపేట, ఫిబ్రవరి 15 : ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఉప గవర్నర్ పదవికి మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామానికి చెందిన గొంది వెంకటరమణ నామినేషన్ వేశారు. కరీంనగర్ లో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రంలో గొంది వెంకటరమణ తన నామినేషన్ వేశారు. ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ లో 230 మంది ఓటు హక్కు కలిగి ఉండగా మార్చి 22న ఎన్నికలు ఉండనున్నాయి.
మారుమూల ప్రాంతం నుంచి ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఉప గవర్నర్ పదవికి నామినేషన్ వేయడం ఇదే మొదటి సారి కావడం విశేషం. ప్రస్తుతం గొంది వెంకటరమణ లయన్స్ క్లబ్ పీఎస్టీ ఫోరం చైర్ పర్సన్ గా ఉన్నారు.