కాసిపేట, అక్టోబర్ 13 : ప్రజలకు కాంగ్రెస్ పడ్డ బాకీ వెంటనే తీర్చాల్సిందే అని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డిమాండ్ చేశారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా చేసిన మోసాన్ని ప్రజలకు వివరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల హామీ ప్రకారం 22 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డ అప్పు వెంటనే ప్రజలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఓటు కోసం ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలన్నారు. వచ్చే ఏ ఎన్నికల్లోనైనా బీఆర్ఎస్ కు గెలిపిస్తే ప్రజల తరపు పోరాడి, ప్రభుత్వం నుంచి హామీలు అమలు చేసే విధంగా పోరాడు తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొల్లు రమణారెడ్డి, గొంది వెంకటరమణ, మాజీ ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్, అగ్గి సత్తయ్య, మాజీ ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, దండవేణి చందు, కైలాష్, గోనె రవి, అట్కపురం రమేష్, కసాడి భూమన్న, సుధీర్, సుధాకర్ రెడ్డి, జాడి రాంచందర్, కుమ్మరి శేఖర్, దుర్గం సాగర్, పెంద్రం హనుమంతు, కొమురయ్య, మంగ శ్రీకాంత్, అఫ్జల్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.