కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని ముత్యంపల్లి, కాసిపేట గ్రామాల్లో గురువారం సాయంత్రం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా దసరా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ గ్రామాల మున్నూరు కాపు కుల బాంధవులు అంతా కలిసి కట్టుగా వెళ్లి జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఒకరికొకరు జమ్మి పంచుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ దసరా పండుగ అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుజేయాలని కోరుకున్నారు.