తాండూర్, ఆగస్టు 4 : గొర్రెలకు నీలి నాలుక నాలుక టీకాలు వేయించాలి అని తాండూర్ మండల పశు వైద్య అధికారి డాక్టర్ నరసింహరావు అన్నారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో పశు వైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలకు నీలి నాలుక వ్యాధి నివారణ టీకాలను సోమవారం వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నర్సింహారావు మాట్లాడుతూ నీలి నాలుక వ్యాధి ప్రధానంగా గొర్రెలలో నోరు, ముక్క నుండి నీరు కారడం జ్వరం లాలజలం కారడం ఉంటుందని తెలిపారు.
గొర్రెల పెంపకందారులకు వ్యాధి నివారణ గురించి పలు సూచనలు చేశారు. గొర్రెల కాపరులు అందరు వారి గొర్రెలకు తప్పనిసరిగా నీలి నాలుక టీకాలు వేయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది అన్నం మల్లేష్, దుర్గం కళ్యాణ్, గొర్రెలు పెంపకం వృత్తి దారులు సంఘం నాయకులు నరిగే ఐలయ్య, సిర్రం పార్వతలు, కాళీ కత్తెరయ్య, దుర్కి లక్ష్మణ్, కోరే మారుతి, తదితరులు పాల్గొన్నారు.