తాండూర్, అక్టోబర్ 28 : జిల్లాలోని పంచాయతీ అధికారులు, కార్యదర్శులు విధుల్లో అలసత్వం వహిస్తూ పారిశుధ్యంపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా పంచాయతి అధికారి డీ వెంకటేశ్వర్ రావు హెచ్చరించారు. మంగళవారం తాండూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఐబీతో పాటు పలు కాలనీల్లో పర్యటించిన డీపీవో పలు విధుల్లో పేరుకుపోయిన చెత్త అపరిశుభ్రమైన వాతావరణాన్ని గమనించి అసంతృప్తి వ్యక్తం చేసారు. చెత్త రోడ్లపై వేసిన పలు దుకాణాల యజమానులకు జరిమానాలు విధించారు.
చెత్త రోడ్లపై వేయద్దని వారికి సూచనలు చేశారు.
మురుగు కాలువలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా ప్రతిరోజు పారిశుధ్య పనులు చేపట్టాలని, పరిశుభ్రమైన నీటిని ప్రజలకు అందించాలని, చెత్తను బయట వేసే దుకాణదారులను గుర్తించి వెంటనే వారికి నోటీసులు జారీ చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించడం జరిగింది. అనంతరం సుబద్ర కాలనీలో ఉర్దూ స్కూల్, అంగన్వాడీ కేంద్రం, ఎంపీపీఎస్ పాఠశాలను తనిఖీ చేసి ఎంపీడీవో కార్యాలయంను సందర్శించారు. డీపీవో వెంట ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో అనిల్ కుమార్, కార్యదర్శి దొండ దివాకర్ ఉన్నారు.