Mrunal Takhur | బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ ఈ మధ్య కాలంలో డేటింగ్, పెళ్లి రూమర్లతో హాట్ టాపిక్‌గా నిలుస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రూమర్స్ మధ్య బాలీవుడ్ హీరో చేసిన పని హాట్ టాపిక్‌గా మారింది. యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది మృణాల్‌పై పూల వర్షం కురిపించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మృణాల్ ఠాకూర్, సిద్ధాంత్ చతుర్వేది కలిసి నటించిన తాజా చిత్రం ‘దో దీవానే షెహర్ మే’ ప్రమోషన్లలో భాగంగా ఈ జంట ఒక ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవెంట్ వేదిక బయట ఫొటోగ్రాఫర్లతో మాట్లాడుతున్న మృణాల్‌పై సిద్ధాంత్ గొడుగులో నింపుకుని తెచ్చిన పూలతో అకస్మాత్తుగా పూల వర్షం కురిపించాడు. దీనికి మృణాల్ ఇచ్చిన స్మైల్ రియాక్షన్ నెటిజన్లను ఆకట్టుకుంది.
అక్కడితో ఆగని సిద్ధాంత్, అదే ప్రమోషనల్ ఈవెంట్ స్టేజ్‌పైనా మరోసారి మృణాల్‌పై పూలు చల్లాడు. ఈ రెండు ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో వీరిద్దరి మధ్య ఏదైనా ప్రత్యేక బంధం ఉందా అనే చర్చలు మొదలయ్యాయి. అభిమానులు, నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తూ ఊహాగానాలు పెంచుతున్నారు. మరోవైపు మృణాల్ ఠాకూర్ తమిళ స్టార్ హీరో ధనుష్‌తో డేటింగ్లో ఉందనే వార్తలు కూడా కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 14న వీరిద్దరి పెళ్లి జరుగుతుందనే రూమర్లు వచ్చినప్పటికీ మృణాల్ టీమ్ వాటిని ఖండించింది. అవి కేవలం పుకార్లేనని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఈ డేటింగ్ వార్తలు మాత్రం పూర్తిగా చల్లారలేదు.
సిద్ధాంత్‌తో మృణాల్ తరచుగా కలిసి కనిపించడం కూడా కొత్త చర్చలకు దారితీస్తోంది. అయితే వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్న కారణంగా ప్రమోషన్లలో భాగంగానే కలుస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ప్రమోషన్లకు అతీతంగా కూడా కలిసి కనిపించారనే వార్తలు రావడంతో ఊహాగానాలు మరింత పెరుగుతున్నాయి. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ తెలుగు, హిందీ భాషల్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ‘దో దీవానే షెహర్ మే’ చిత్రం ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానుండగా, అడివి శేష్‌తో కలిసి నటించిన తెలుగు సినిమా ‘డెకాయిట్’ ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో మృణాల్ వ్యక్తిగత జీవితం, కెరీర్ రెండూ కూడా వార్తల్లో నిలుస్తున్నాయి.
#MrunalThakur and #sidhhantchaturvedi looking too adorable together 😍😍#Actresshot #actress #bollywoodactress #Bollywood #Actresshot Adil Rashid #WamiqaGabbi #เลือกตั้ง69 Nepal # pic.twitter.com/VarrMayJLb
— Encounter India (@Encounter_India) February 8, 2026