Khammam | ఖమ్మం జిల్లాలో సాగునీటి కోసం రైతన్నలు రోడ్డెక్కారు. కొణిజర్ల మండలం గుబ్బగుర్తి వద్ద రహదారిపై రాస్తారోకోకు దిగారు. సాగు నీరు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని.. వెంటనే సాగునీటిని అందించిన పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు.
నాగార్జున సాగర్ నుంచి అధికారులు నీళ్లు విడుదల చేయకపోవడంతో తమ మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయని ఈ సందర్భంగా రైతన్నలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్థానిక నాయకులను కలిసినా పట్టించుకోవడం లేదన్నారు. దీనికి నిరసనగానే ఏస్కూరు – పల్లిపాడు రహదారిపై రైతన్నలు ఆందోళనకు దిగారు. రైతుల ఆందోళనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
ఖమ్మం జిల్లాలో సాగునీటి కోసం రైతన్నల ధర్నా
సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని రాస్తారోకో
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తి వద్ద రహదారిపై రాస్తారోకోకు దిగిన రైతులు
సాగునీరు రాక మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయని, నాగార్జున సాగర్ నుండి అధికారులు నీళ్లు విడుదల చేయడంలేదని,… pic.twitter.com/IKPUXAAGu5
— Telugu Scribe (@TeluguScribe) February 9, 2026