కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులు సమయపాలన పాటించడం లేదని విమర్శలు వెళ్లు వెత్తుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కావాల్సిన వైద్య సేవలు మంగళవారం 10 గంటలైనా వైద్య అధికారులు, సిబ్బంది లేక రోగులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వైద్యులు ఎవరూ లేరు, ఒక్కరు మాత్రమే సిబ్బంది ఉండి సేవలు అందించే పరిస్థితి నెలకొంది.
అధిక సంఖ్యలో వైద్యం కోసం రాగా వైద్యులు సమయానికి రాక రోగులు ఇబ్బందులు పడ్డారు.
ఏజెన్సీ మండలంతో పాటు జ్వరాల సీజనల్ కావడంతో ఎక్కువగా ప్రభుత్వ దవాఖాన సేవలపైనే ఆధార పడుతుండగా సమయానికి వైద్యులు రాక ప్రైవేట్ వైద్యానికి వెళ్లాల్సి పరిస్థితి నెలకొందని పలువురు పేర్కొంటున్నారు. సమయపాలన పాటించి వైద్య సేవలు అందించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై డీడీవో రవి కిరణ్ ను వివరణ కోరగా ఒక్క రోజు అనివార్య కారణాల వద్ద వైద్యులు ఆలస్యమయ్యారని, ఇలాంటివి కాకుండా చూసుకుంటామన్నారు.