మంచిర్యాల అర్బన్, జూన్ 27: మంచిర్యాలలోని (Mancherial) సోషల్ వెల్ఫేర్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీ హాస్టల్ భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం మార్తిడ్ గ్రామానికి చెందిన కుమ్మరి స్వప్న (19) మంచిర్యాలలోని సాంఘిక సంక్షేమ డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలో బీజెడ్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో కాలేజీ హాస్టల్ బిల్డింగ్‌పై నుంచి దూకింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
అనంతరం మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్ నిమ్స్‌కు తీసుకొచ్చారు. దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం 3 గంటలకు మృతిచెందింది. కాగా స్వప్న.. కాలేజీ భవనం పైనుంచి ప్రమాదవశాత్తు పడిందా లేదా ఆత్మహత్యయత్నానికి పాల్పడిందా అనేదానిపై స్పష్టత రాలేదు.