తాండూర్, ఆగస్టు 16 : మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం సింగరేణి ప్రాంతమైన మాదారం టౌన్ షిప్ సింగరేణి కమ్యూనిటి హాలులో శనివారం రోజున దూరదర్శన్ (డీడీ యాదగిరి) ఆధ్వర్యంలో మస్త్ మజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మహిళలకు ఆటలు, పాటలు, నృత్యాలు కోలాటాలు తదితర పోటీలను నిర్వహించారు. విజేతలుగా నిలిచిన మహిళలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో టౌన్షిప్ లోని మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఎంజాయ్ చేస్తూ సందడి చేశారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ప్రొడ్యూసర్ గీత, అసిస్టెంట్ శ్రీనివాస్, జేఎస్ కుమారి, యాంకర్ వినీల్, ఆడియో కృష్ణమూర్తి, జయప్రసాద్, కెమెరామెన్లు వంశీకృష్ణ , ఉదయ్, అహ్మద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.