కాసిపేట, అక్టోబర్ 6 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని సల్పాలవాగు సమీపంలోని వెంకటాద్రి దేవాలయం వద్ద అక్టోబర్ 15,16వ తేదీల్లో రెండు రోజుల పాటు దండారీ ఉత్సవాలను నిర్వహించేందుకు తీర్మానం చేశారు. సోమవారం కాసిపేట మండలంలోని సల్పాలవాగు వద్ద నిర్వహించిన సమావేశంలో దండారీ నిర్వాహకులు, గ్రామ పటేళ్లు, ఆదివాసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో చర్చించి ఈ మేరకు తీర్మానం చేశారు. 15వ తేదీ దండారీ నిర్వాహణ, పూజలు, 16న దండారీ దర్బార్ నిర్వహించేందుకు నిర్ణయించారు.
ఆనంతరం దండారీ ఉత్సవ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కుంరం జనార్ధన్, ప్రధాన కార్యదర్శిగా ఆడే జంగు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పెంద్రం హన్మంతు, గౌరవాధ్యక్షులుగా రాయిసిడం రామాస్, ఉపాధ్యాక్షులుగా పెంద్రం ప్రభాకర్, ఆత్రం జంగు, రాయిసిడం భీము, కనక గోవర్ధన్, సోయం సూరు, మడావి ధర్మారావు, సిడం గణపతి, కోశాధికారిగా మెస్రం రంజిత్, కార్యదర్శులుగా కుడ్మెత లక్ష్మణ్, కోట్నాక రాజేష్, ఆత్రం శ్రీనివాస్, రాయిసిడం రమేష్, సిడం రాజు, కుంఠం జగ్గెరావు, ప్రచార కార్యదర్శిగా చిక్రం రాందాస్, మడావి మన్ మోహన్‌ను ఎన్నుకున్నారు.