తాండూర్, ఆగస్టు 19: మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో సీఐటీయూ నాయకులు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తాండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట మంగళవారం ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి దాగాం రాజారాం మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్సీల ముందు ఆశా వర్కర్లతో కలిసి ధర్నా చేపట్టామని అన్నారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
రూ.18 వేల ఫిక్స్ వేతనం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. ప్రభుత్వం వెంటనే హామీలు నెరవేర్చకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం హాస్పిటల్ సిబ్బంది లక్ష్మీప్రసన్నకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు కవిత, రాజేశ్వరి సావిత్రి, సునీత, భాగ్య, చంద్రకళ, భారతి, అనురాధ, జయ, మళ్లీశ్వరి లక్ష్మి, సంధ్యారాని, నర్సుబాయి, మంజుల, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.