మంచిర్యాల, ఏప్రిల్ 10, నమస్తే తెలంగాణ : హాజీపూర్ మండలం గుడిపేటలోని 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్‌లో ఉచిత పోలీస్ శిక్షణలో భాగంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆదివారం పరీక్షలు నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ఎత్తు కొలతలు, 10 గంటలకు రాత పరీక్ష నిర్వహించారు. కలెక్టర్ భారతీ హోలికేరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పరీక్షకు మొత్తం 2,640 మంది దరఖాస్తు చేసుకోగా, 1,943 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 614 మంది మహిళలు, 1329 మంది పురుషులు కాగా, 697 మంది హాజరుకాలేదు. అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వారి మొబైల్స్‌కు మెస్సేజ్ ఇవ్వనున్నట్లు కమాండెంట్ ఎం.రామకృష్ణ తెలిపారు. ఈ పరీక్షలను అసిస్టెంట్ కమాండెంట్ రఘునాథ్ చౌహాన్, రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, భాస్కర్, కుమార స్వామి, మారుతి, అశోక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్డీ చౌహాన్, మహిళా ఎస్ఐలు హైమ, సంధ్య, ట్రాఫిక్ ఎస్ఐ సురేందర్, హాజీపూర్ ఎస్ఐ ఉదయ్‌కిరణ్, ఆర్ఎస్ఐలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.