తాండూర్, డిసెంబర్ 2 : ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అన్నారు. మంగళవారం తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలయిన తాండూర్, అచ్చలాపూర్ కేంద్రాలను తాండూర్ సీఐ దేవయ్య, ఎస్ఐ కిరణ్ కుమార్ తో కలిసి ఆయన పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంతవరకు ఎన్నికల నియమావళి ప్రకారం ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలని ఎవరైనా అట్టి నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమన్నారు.
అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏసీపీ తెలిపారు. సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే వీడియోలను తీసి పెట్టొద్దని, అలాంటివి మా దృష్టికి వస్తే గ్రూప్ అడ్మిన్ లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని కోరారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొని వంద శాతం పోలింగ్ కు సహకరించాలని కోరారు.