మందమర్రి(రూరల్) : మండలంలోని పొన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2006- 07 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని పాఠశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అందరూ ఒకచోట చేరి చిన్ననాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. బాల్యమిత్రులు ఒకరి యోగక్షేమాలు మరొకరు అడిగి తెలుసు కున్నారు. పాఠశాలలో గడిపిన చిన్ననాటి మధురానుభూతులను నెమరు వేసుకున్నారు.
ఈ సందర్బంగా విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఉపాద్యాయులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ సుదీర్ఘ కాలం అనంతరం బాల్యమిత్రులు కలిసి చదువుకున్న పాఠశాలలో కలుసుకొని ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం జీవితంలో మరిచి పోలేనిదన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అప్పటి ఉపాధ్యాయులు రవి, శ్రీనివాస్, నగేష్, రాంచందర్, తిరుమల, విద్యార్థులు పాల్గొన్నారు.