Food Poison | అన్నంలో పురుగులొచ్చాయని చెప్పినా.. హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యంతో 40 విద్యార్థినులకు అస్వస్థత
Food Poison | బెల్లంపల్లి ప్రభుత్వ ఎస్సీ బాలికల గురుకుల స్కూల్లో నిన్న రాత్రి కలుషిత ఆహారం తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. అస్వస్థతకు లోనైన 40 మంది విద్యార్థినులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Food Poison | మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి ప్రభుత్వ ఎస్సీ బాలికల గురుకుల స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయింది. నిన్న రాత్రి కలుషిత ఆహారం తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. అస్వస్థతకు లోనైన 40 మంది విద్యార్థినులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పరామర్శించారు.
కాగా ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాత్రి 7:30 గంటలకు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని ఫోన్ చేసిన తెలుపగా.. హాస్టల్ వార్డెన్ రాత్రి 10 గంటలకు హాస్టల్ వద్దకు వెళ్లడం గమనార్హం. అన్నంలో పురుగులు వచ్చాయని తెలిపినా పడేయకుండా అలాగే తినాలని హాస్టల్ వార్డెన్ విద్యార్థినులకు చెప్పినట్టు సమాచారం. ఫుడ్ పాయిజన్ అయిన విషయం బయటకు వస్తే పరువు పోతుందని హాస్టల్ వార్డెన్ విద్యార్థినులకు ఆర్ఎంపీ డాక్టర్తో చికిత్స చేయించాడు.
108కి కాల్ చేయమని విద్యార్థినులు ఎంత వేడుకున్నా హాస్టల్ సిబ్బంది వారిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా అక్కడే చూస్తూ కూర్చున్నారు. హాస్టల్ వార్డెన్ వచ్చే వరకు మూడు గంటలపాటు నరకం అనుభవించామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు.
బ్రేకింగ్ న్యూస్
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ప్రభుత్వ ఎస్సీ బాలికల గురుకులంలో ఫుడ్ పాయిజన్
20 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత.. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు pic.twitter.com/DbzfjOC65D
— Telugu Scribe (@TeluguScribe) February 6, 2026
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్
నిన్న రాత్రి కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థినులు
ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 20 మంది విద్యార్థినులను పరామర్శించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య https://t.co/EP6Vszz43Y pic.twitter.com/FablBWe7Xp
— Telugu Scribe (@TeluguScribe) February 7, 2026
ఇంత దుర్మార్గమా!!
ఫుడ్ పాయిజన్ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని విద్యార్థినులకు ఆర్ఏంపీ వైద్యుడితో చికిత్స చేయించిన హాస్టల్ వార్డెన్
108కి కాల్ చేయమని విద్యార్థినులు వేడుకున్నా.. కనికరించకుండా అలాగే చూస్తూ కూర్చున్న హాస్టల్ సిబ్బంది
అన్నంలో పురుగులు వచ్చాయని తెలిపినా… https://t.co/9NlbU1CifA pic.twitter.com/TVRS2KNH97
— Telugu Scribe (@TeluguScribe) February 7, 2026
Read Also :
Raja Saab | ఓటీటీలో ‘ది రాజా సాబ్’ సందడి… జియో హాట్స్టార్ ఆఫీస్కు బిర్యానీ వరద కురిపించిన ప్రభాస్ ఫ్యాన్స్!
SS Karthikeya |SS Karthikeya | హైదరాబాద్లో దోమల బీభత్సం.. సెటైరికల్ వీడియో వదిలిన రాజమౌళి కొడుకు కార్తీకేయ!
హైదరాబాద్లో దోమల బీభత్సం.. సెటైరికల్ వీడియో వదిలిన రాజమౌళి కొడుకు కార్తీకేయ!
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

