మంచిర్యాల అర్బన్, ఆగస్టు 21 : జిల్లాలో మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఆరో తరగతిలో ప్రవేశానికి, మ ధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఏడు నుంచి పదో తరగతి వరకు ఖాళీ సీట్ల భర్తీకి పరీక్ష నిర్వహించారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల టెంపరేచర్ చెక్ చేసిన అనంతరం శానిటైజ్ చేసి పరీక్షా హాలులోకి అనుమతించారు. ఆరో తరగతిలో ప్రవేశానికి 821 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 652 (72 శాతం) మంది హాజరు కాగా 169 మంది గైర్హాజరయ్యారని, అదేవిధంగా ఏడు నుంచి పదో తరగతి వరకు మిగులు సీట్లకు 771 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 593 (76 శాతం) మంది హాజరు కాగా, 178 మంది గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఏసీజీఈ డీ దామోదర్ రావు పరీక్షా కేంద్రాలను సందర్శించారు.
కోటపల్లి మండలకేంద్రంలో..
కోటపల్లి, ఆగస్టు 21 : మండలకేంద్రంలోని మోడల్ స్కూ ల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఆరో తరగతిలో 48 మం ది విద్యార్థులకు 30 మంది, ఏడు నుంచి పదో తరగతుల ప్రవేశానికి 16 మందికి 11 మంది విద్యార్థులు హాజరైనట్లు పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ టీ లక్ష్మారెడ్డి, డిపార్ట్ మెంటల్ అధికారి బాణాల లక్ష్మీనారాయణ తెలిపారు.
ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలో..
ఆసిఫాబాద్ టౌన్, ఆగస్టు 21: జిల్లాకేంద్రంలో మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఆరో తరగతిలో ప్రవేశానికి 292 మంది దరఖాస్తు చేసుకోగా 246 మంది హాజరు కాగా, 46 మంది గైర్హాజరయ్యారు. అదేవిధంగా ఏ డు నుంచి పదో తరగతి వరకు 280 మందికి 216 మంది హాజరు కాగా, 64 మంది గైర్హాజరయ్యారని ప్రిన్సిపాల్ ఖాలీల్ తెలిపారు.