బెల్లంపల్లిటౌన్, ఆగస్టు 16 : దళితబంధు పథకం ప్రారంభోత్సవం కోసం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని శాలపల్లి వద్ద నిర్వహించిన సీఎం కేసీఆర్ సభకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో బెల్లంపల్లి నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ దళిత బంధు పథకంపై సీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు బడుగు, బలహీన, దళిత వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నాయని తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. సభకు తరలివెళ్లిన వారిలో నియోజకవర్గంలోని ఏడు మండలాలు, మున్సిపాలిటీలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
హాజీపూర్, ఆగస్టు 16 : సీఎం కేసీఆర్ సభకు హాజీపూర్ మండలంలోని పలువురు సర్పంచ్‌లు నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్‌రావు ఆధ్వర్వంలో ఉదయం మండల కేంద్రం నుంచి బయలుదేరి వెళ్లారు. విజిత్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారని కొనియాడారు. సభకు వెళ్లిన వారిలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మొగిళి శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ మందపెల్లి శ్రీనివాస్, సర్పంచ్‌లు, నాయకులు ఉన్నారు.
దండేపల్లి, ఆగస్టు 16 : దండేపల్లి మండలంనుంచి టీఆర్ఎస్ నాయకులు గోళ్ల రాజమల్లు, ఎల్ బాపు, జాడి రాజన్న, మాడ దయాకర్, మల్యాల శ్రీనివాస్, దార శ్రీనివాస్, తదితరులు తరలివెళ్లారు.
శ్రీరాంపూర్, ఆగస్టు 16 : నస్పూర్, శ్రీరాంపూర్ ఏరియా నుంచి నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఇసంపెల్లి ప్రభాకర్ ఆధ్వర్యంలో నస్పూర్, శ్రీరాంపూర్ ఏరియా దళిత సంఘాల నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు ఆక్కూరి సుబ్బయ్య, గర్సె రామస్వామి, వేల్పుల రాజేశ్, గర్సె భీమయ్య, పోషమల్లు, కాటం రాజు తదితురులున్నారు.
తాండూర్, ఆగస్టు 16 : తాండూర్ మండలం నుంచి ఎంపీపీ పూసాల ప్రణయ్‌కుమార్, జడ్పీటీసీ సాలిగామ బానయ్య, వైస్ ఎంపీపీ దాగాం నారాయణ, ఎంపీటీసీ మొగిలి శంకర్, కో ఆప్షన్ సభ్యుడు నజ్జీఖాన్, ఏఎంసీ డైరెక్టర్ భాస్కర్‌గౌడ్, సర్పంచ్ చీమల శంకర్, నాయకులు భీమ రాజ్‌కుమార్, మద్దికుంట రాంచందర్, గాజుల శ్రీనివాస్, రేపాక రమేశ్, ఏల్పుల రాజు, కుర్సెంగ బాబురావు, గొర్లపెల్లి విజయ్, రుకుం సంతోష్, దాగాం పాపయ్య, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు తరలి వెళ్లారు.
చెన్నూర్, ఆగస్టు 16: చెన్నూర్ నుంచి మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తుల సమ్మయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ నవాజొద్దీన్, టీఆర్ఎస్ నాయకులు రాంలాల్ గిల్డా, నాయిని సతీశ్, వెంకటరాజం, గర్రపల్లి వెంకటనర్సయ్య, సురేశ్‌రెడ్డి, తదితరులు తరలివెళ్లారు.
కోటపల్లి, ఆగస్టు 16 : ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ నేతృత్వంలో ఆరు బస్సుల్లో సుమారుగా 500 మంది తరలివెళ్లారు. వైస్ ఎంపీపీ వాల శ్రీనివాస్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బైస ప్రభాకర్, నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముల్కల్ల శశిపాల్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు మారిశెట్టి విద్యాసాగర్, సర్పంచ్ పున్నంచంద్, మండల నాయకులు మంత్రి రామయ్య, వేముల రాజం, పిల్లి సమ్మయ్య, గోనె మోహన్ రెడ్డి, కొమిరెల్లి విజయ్, బెల్లంపల్లి అశోక్ తదితరులు వెళ్లారు.
మందమర్రి ఆగస్టు 16 : మందమర్రి పట్టణం నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులకు చెందిన టీఆర్ఎస్ శ్రేణులు బస్సులు, ఇతర వాహనాల్లో తరలివెళ్లారు.
కాసిపేట, ఆగస్టు 16 : కాసిపేట మండలం నుంచి బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపుమేరకు జడ్పీటీసీ పల్లె చంద్రయ్య ఆధ్వర్యంలో నాయకులు ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్లారు. రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు దుర్గం పోశం, ఓసీసీ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్, భూక్యా రాంచందర్, సర్పంచ్ ఆడె బాదు, ఉప సర్పంచ్‌లు బోయిని తిరుపతి, పిట్టల సుమన్, టీఆర్ఎస్ దేవాపూర్ అధ్యక్షుడు గడ్డం పురుషోత్తం, ఉపాధ్యక్షుడు బింగి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ రొడ్డ రమేశ్, ఉపాధ్యక్షుడు అగ్గి సత్తయ్య, మహేందర్, అక్కేపల్లి బుగ్గ రాజు, లంక లక్ష్మణ్, మల్లేశ్, రాజేశం, తదతరులు వెళ్లారు.
గర్మిళ్ల, ఆగస్టు 16 : మంచిర్యాల నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. యువ నాయకుడు నడిపెల్లి విజిత్ రావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, టీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ విభాగం మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు దుర్గం రాజేశ్, కార్యదర్శి కడమండ రమేశ్, పార్టీ పట్ణణ ఉపాధ్యక్షుడు సుమోహన్, విశ్వనాథ ఆలయ డైరెక్టర్లు చరణ్‌దాస్, కాడె ఎల్లయ్య, యువజన విభాగం నాయకులు సుధామల్ల అశోక్ తేజ, బోడ ధర్మేందర్, తీగల పద్మారావు తరలివెళ్లారు.
లక్షెట్టిపేట రూరల్, ఆగస్టు 16 : లక్షెట్టిపేట మండలం నుంచి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు అంకతి రమేశ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బియ్యాల తిరుపతి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు నడిమెట్ల రాజన్న, కౌన్సిలర్ చాతరాజు రాజన్న, సర్పంచ్ల సంఘం మండల ప్రధాన కార్యదర్శి ఆసాది పురుషోత్తం, దొంత నర్సయ్య, గోళ్ల రాయమల్లు, మినుముల శాంతి కుమార్, గరిసే రవీందర్, చిప్పకుర్తి నారాయణ, తొగరి కాంతయ్య, బాపు, మాడ దయాకర్, రాపల్లి వసంతయ్య, ఏసన్న, తదితరులు వెళ్లారు.