పింఛన్ పెంచిన ఘనత సీఎందే
ఎంపీ వెంకటేశ్ నేతకాని
మంచిర్యాలలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, కలెక్టర్‌తో కలిసి 128 బ్యాటరీ ట్రై సైకిళ్లు పంపిణీ
మంచిర్యాల అర్బన్, జూలై 2 : దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని అన్నారు. మార్కెట్ కమిటీ ఆవరణలో తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దివ్యాంగులకు పింఛన్ పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. అనంతరం జిల్లాకు 290 బ్యాటరీ సైకిళ్లు రాగా, ఇందులో మంచిర్యాల నియోజకవర్గానికి మంజూరైన 128 బ్యాటరీ ట్రై సైకిళ్లను ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్, ఎమ్మెల్యే దివాకర్ రావు, కలెక్టర్ భారతీ హోళికేరితో కలిసి అర్హులైన దివ్యాంగులకు ఎంపీ అందజేశారు. కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ ముఖేశ్ గౌడ్, నస్పూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, వైస్ చైర్మన్ గోపతి లస్మయ్య, మంచిర్యాల పీఏసీఎస్ చైర్మన్ సందెల వెంకటేశ్, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కో ఆర్డినేటర్ అత్తి సరోజ, డీడబ్ల్యూవో ఉమాదేవి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు గాదె సత్యం, హరికృష్ణ, వంగ తిరుపతి, అన్నపూర్ణ, గొంగళ్ల శంకర్, నాయకులు, దివ్యాంగులు, తదితరులు పాల్గొన్నారు.